AP High Court: ఆ ఇద్దరి మృతదేహాలు అప్పగించండి.. హైకోర్టులో పిటిషన్
ABN, Publish Date - May 24 , 2025 | 12:55 PM
AP High Court: ఎన్‌కౌంటర్‌లో మరణించిన నంబాల కేశవరావు, సజ్జ నాగేశ్వరరావు మృతదేహాలను అప్పగించాలంటూ బంధువులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారించింది.
అమరావతి, మే 24: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Chhattisgarh Encounter) మరణించిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు (Nambala Keshavarao), సజ్జ నాగేశ్వరావు మృతదేహాలను అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నంబాల, నాగేశ్వరరావు తరపు బంధువులు ఏపీ హైకోర్టులో (AP High Court) హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం ఈరోజు (శనివారం) విచారణ జరిపింది. మృతదేహాలకు పోస్టుమార్టం జరిగిందని ఛత్తీస్‌గఢ్ అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఇప్పటికే 21 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశామని న్యాయస్థానానికి అడ్వకేట్ జనరల్ తెలిపారు.
ఎన్‌కౌంటర్ జరిగింది ఛత్తీస్‌గఢ్‌లో అని అక్కడే పిటిషన్ వేయాలని ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. పోస్టుమార్టం పూర్తి అవ్వడంతో మృతదేహాలను ఇస్తామని చెబుతున్నారని... అందువలన పిటిషనర్‌లు ఛత్తీస్‌గఢ్ అధికారులను సంప్రదించవచ్చని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు పిటిషనర్‌లకు న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది. పిటిషనర్‌ల తరఫున సీనియర్ కౌన్సిల్ సత్యప్రసాద్ వాదించారు.
ఇవి కూడా చదవండి
కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Read latest AP News And Telugu News
Updated Date - May 24 , 2025 | 12:58 PM