Good News: ఆంధ్రప్రదేశ్‌కు రానున్న మరో కీలక ప్రాజెక్టు
ABN, Publish Date - May 13 , 2025 | 10:54 AM
Good News: ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. మూడు రాష్ట్రాలలో భారీ నౌకల నిర్మాణం, మరమత్తు సెంటర్‌లు ఏర్పాటు చేయనుంది. ఈ మూడింటిలో ఏపీ కూడా ఉంది. మూడు రాష్ట్రాలలో ఏర్పాటు కోసం అవసరమైన స్థలాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు కేంద్ర ప్రభుత్వం (Central government) శుభవార్త (Good News) చెప్పింది. ఏపీకి మరో కీలక ప్రాజెక్టు (Key Project) రానుంది. రాష్ట్రంలో భారీ నౌకల నిర్మాణం, మరమత్తు సెంటర్ (Major Shipbuilding, Repair Center) ఏర్పాటు కానుంది. ఏపీతో పాటు దేశంలో మరో రెండు చోట్ల కూడా ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్ పాటు గుజరాత్ (Gujarat), తమిళనాడు (Tamil Nadu)లో మూడు చోట్ల ఓడల తయారీ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. విదేశీ సంస్థలతో కలిసి షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయనుంది.
Also Read: మరో కోణంలో ఒత్తిడికి సిద్ధమైన కేంద్రం...
మూడు రాష్ట్రాలలో ఏర్పాటు..
మూడు రాష్ట్రాలలో ఏర్పాటు కోసం అవసరమైన స్థలాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఏపీలో దుగ్గరాజపట్నంలో షిప్ బిల్డింగ్, రిపేర్ సెంటర్ ఏర్పాటు కానుంది. షిప్ బిల్డింగ్, రిపేర్ సెంటర్స్ కోసం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆసక్తి ఉన్న ఇతర విదేశీ సంస్థల మధ్య చర్చలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయి. నౌకా రంగంలో భారత్‌తో కలిసి పనిచేందుకు దక్ణిణ కొరియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ సహా పలు దేశాలు ఆసక్తి చూప్తిస్తున్నాయి. దేశంలో నౌకల తయారీ, నిర్మాణ రంగాన్ని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో షిప్ బిల్డింగ్‌కు ప్రోత్సహించేందుకు దాదాపు రూ. 45 వేల కోట్లు వరకు కేంద్రం కేటాయించింది. సముద్రయాన రంగ వ్యాపార అభివృద్ధిని ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. రాష్ట్రానికి ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రత్యేక విధానం కూడా ప్రకటించింది.
తిరుపతి జిల్లాలోని దుగ్గరాజపట్నంలో షిప్ బిల్డింగ్, రిపేర్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించింది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై చర్చించడానికి కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్పానంద సోనోవాల్ ఆధ్వర్యంలో ఒక టీమ్ మంగళవారం ఏపీకి రానుంది. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం అవుతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
TGCSB:సైబర్ నేరస్తుల కోసం స్పెషల్ ఆపరేషన్
చిత్తూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర వేడుకలు
For More AP News and Telugu News
Updated Date - May 13 , 2025 | 11:03 AM