TGCSB:సైబర్ నేరస్తుల కోసం స్పెషల్ ఆపరేషన్
ABN , Publish Date - May 13 , 2025 | 09:43 AM
TGCSB: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 20 మందిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) అధికారులు అరెస్టు చేశారు. మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రెండు బృందాలు రెక్కీ నిర్వహించి వారిని అరెస్టు చేసినట్టు సీఎస్‌బీ డీజీ ప్రకటించారు.
హైదరాబాద్: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (Telangana Cyber Security Bureau) ఆధ్వర్యంలో సైబర్ నేరస్తుల కోసం టీజీసీఎస్‌బీ (TGCSB) స్పెషల్ ఆపరేషన్ (special operation) చేపట్టింది. 20 మంది సైబర్ నేరస్తులను అరెస్టు (20 Cyber Criminals Arrested) చేసింది. సైబర్ క్రిమినల్స్‌కు మ్యూల్ బ్యాంకు ఖాతాలు సరఫరా చేస్తున్న ఏజెంట్లతో పాటు.. సహకరిస్తున్న ముఠాను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది. మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అరెస్ట్ అయిన వారిలో 14 మంది మ్యూల్ ఖాతాదారులు, ఆరుగురు ఏజెంట్లు పట్టుబడిన వారిలో ఉన్నారు. నిందితులపై తెలంగాణలో 60కి పైగా కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 515 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు.
ప్రాథమిక విచారణలో 27 మ్యూల్ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా రూ. 44.37 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. తెలంగాణలోనే ఐదుగురు నిందితులు చెక్కుల ద్వారా రూ 22,64,500 విత్ డ్రా చేశారు. నిందితులలో ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, బ్యాంకు ఉద్యోగి ఉన్నారు. వ్యాపారం, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, ట్రేడింగ్ పార్ట్ టైం ఉద్యోగాల పేరట మోసాలు జరుగుతున్నాయి. అరెస్ట్ అయిన నిందితుల వద్ద నుంచి 20 మొబైల్ ఫోన్లు, 28 సిమ్ కార్డులు, 4 ఏటీఎంలు, 5 చెక్కు బుక్కులు, రెండు పాన్ కార్డులు, రెండు రబ్బర్ స్టాంపులు, పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: చిత్తూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర వేడుకలు
వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల వివరాలను అపరిచితులకు తెలియజేయవద్దని, ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌ను లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సీఎస్‌బీ డీజీ శిఖా గోయెల్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎలుకలన్నీఘోషించినా వేస్ట్.. పవన్ షాకింగ్ ట్వీట్..
హైదరాబాద్‌లో సుందరీమణుల సందడి..
For More AP News and Telugu News