ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Lanka Dinakar: 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

ABN, Publish Date - May 29 , 2025 | 12:44 PM

Lanka Dinakar: భారత్ ఆయుధాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, 2047 నాటికి భారత్‌ను విశ్వ గురువుగా నిలిపేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారని ఏపీ బీజేపీ నేత లంక దినకర్ అన్నారు.

AP BJP Leader Lanka Dinakar

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నిర్ణయాలతో ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ (India 4th Largest Economy) ఎదిగిందని, మరో రెండేళ్లలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందని ఏపీ బీజేపీ నేత (AP BJP Leader) లంకా దినకర్ (Lanka Dinakar) వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా ఆయన గురువారం ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడారు. 2047 నాటికి వికసిత భారత్ (Viksit Bharat) లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని కొనియాడారు.


వికసిత భారత్, వికసిత ఏపీ లక్ష్యం..

వికసిత భారత్‌లో ఆంధ్రప్రదేశ్ పాత్రను సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారని, వికసిత భారత్, వికసిత ఏపీ లక్ష్యంగా వేగంగా ప్రణాళికలు చేపడుతున్నారని, డబుల్ ఇంజన్ ప్రభుత్వం చేపడుతుందని లంక దినకర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్య పరిస్థితులు ఉన్న..భారత దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. అత్యధిక వృద్ధి రేటు నమోదు చేస్తున్న దేశంగా భారత్ ఉందన్నారు. 2014-19 నుంచి ప్రధాని మోదీ మొదలు పెట్టిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఉపయోగపడ్డాయన్నారు. ఆత్మ నిర్భర భారత్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది ఆపరేషన్ సిందూర్ ద్వారా తెలిసిందన్నారు.

Also Read: ప్రభాస్ అభిమానులకు శుభవార్త


అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు

భారత ఆయుధాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, 2047 నాటికి భారత్‌ను విశ్వ గురువుగా నిలిపేలా ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారని లంక దినకర్ అన్నారు. గడిచిన 11 ఏళ్లలో జన ధన యోజన ఖాతాలు, పీఎం ఆవాస యోజన, జలజీవన్ మిషన్ ,అమృత పథకం, మరుగుదొడ్ల నిర్మాణం, స్మార్ట్ సిటీలు, గరిబ్ కళ్యాణ్ యోజన, ముద్ర యోజన, ఆయుష్ మాన్ భారత్, గ్రామీణ సడక్ యోజన, పీఎం కిసాన్ యోజన ద్వారా, రైతు సంక్షేమం అనేక పథకాలతో దేశాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోందని లంక దినకర్ వ్యాఖ్యానించారు.


కాగా టీమ్ ఇండియాలా అందరూ కలిసి పనిచేసి 2047 నాటికి భారత్‌ను వికసిత భారత్‌గా చేయాలని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆయన అధ్యక్షతన నాలుగు రోజుల క్రితం నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. 'వికసిత రాజ్యం, వికసిత భారత్ @2047' అనే థీమ్‌తో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇది 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రాష్ట్రాల కీలక పాత్రను ఈ సమావేశంలో చర్చించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీ సిక్కిం పర్యటన రద్దు

ఐదు వేల మందితో యోగాంధ్ర కార్యక్రమం

For More AP News and Telugu News

Updated Date - May 29 , 2025 | 04:15 PM