AP News: ఏడుగురు కేంద్రమంత్రులతో భేటీకానున్న సీఎం చంద్రబాబు
ABN, First Publish Date - 2025-05-23T11:10:40+05:30
CM Chandrababu: ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు పలువురు కేంద్రమంత్రులను కలుస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న, ప్రతిపాదిత ప్రాజెక్టుల సత్వరం అమలుకు కేంద్రప్రభుత్వం మద్దతు కోరేందుకు ముఖ్యమంత్రి గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. శుక్ర, శనివారాల్లో ఇక్కడే ఉంటారు. సీనియర్ కేంద్ర మంత్రులతో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించనున్నారు.
CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఢిల్లీ పర్యటన (Delhi Visit)లో బిజీ బిజీగా ఉన్నారు. శుక్రవారం ఏడుగురు కేంద్రమంత్రులతో (Seven Union Ministers) ఆయన భేటీకానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, పథకాలపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ప్రాజెక్టులు, పథకాలు అమలుకు ఏపీకి సహకరించాలని కేంద్ర మంత్రులను కోరనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi)తో భేటి అయ్యారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఏపీకి సహకారం అందించాలని కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. తర్వాత 11 గంటలకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh)ను చంద్రబాబు కలవనున్నారు. ఏపీలో వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్ట్‌లపై ఆయనతో చర్చించనున్నారు. బీఈఎల్ డిఫెన్స్ కాంప్లెక్స్, హెచ్‌ఏఎల్-ఏఎంసీఏ తదితర అంశాలపై చర్చించనున్నారు.
మధ్యాహ్నాం 12 గంటలకు జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. సాయంత్రం 3 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రిని కలవనున్నారు. తర్వాత 4 గంటలకు అమిత్‌షా నిర్వహించే సమీక్షకు హాజరవుతారు. నూతన నేర చట్టాల అమలుపై సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిని కలవనున్నారు. శనివారం జరగనున్న నీతి అయోగ్ పాలకమండలి భేటిలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
కాగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న, ప్రతిపాదిత ప్రాజెక్టుల సత్వర అమలుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు కోరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. శుక్ర, శనివారాల్లో ఇక్కడే ఉంటారు. సీనియర్ కేంద్ర మంత్రులతో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇది డిన్నర్ మీటింగ్‌గా తెలియచచ్చింది. ఇటీవల ప్రధాని మోదీతో మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి 2 గంటల పాటు డిన్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. తర్వాత రెండో స్థానంలో ఉన్నటువంటి అమిత్ షాతో సీఎం చంద్రబాబు నాయుడు డిన్నర్ మీట్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ డిన్నర్ మీట్‌లో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలియవచ్చింది. ముఖ్యంగా ఏపీలో లిక్కర్ స్కాం.. జగన్ హయాంలో ఐదేళ్లలో జరిగిన కుంభకోణాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఏది ఏమైప్పటికీ అటు ప్రధాని మోదీ.. ఇటు అమిత్ షాతో డిన్నర్ మీటింగ్‌లు జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నువ్వు ఒకటంటే.. నేను రెండు అంటా..
For More AP News and Telugu News
Updated Date - 2025-05-23T18:17:41+05:30 IST