ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Birthday Wishes: భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ABN, Publish Date - Jun 20 , 2025 | 09:24 AM

Birthday Wishes: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

CM Chandrababu Naidu

Amaravati: నారా భువనేశ్వరి (Bhuvaneshwari) పుట్టినరోజు (Birthday) సందర్భంగా టీడీపీ అధినేత (TDP Chief), ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సతీమణికి జన్మదిన శుభకాంక్షలు (Wishes) తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘భువనేశ్వరి! మీ ప్రేమ.. బలం మా కుటుంబానికి పునాది. ప్రతి ఒడిదుడుకులలో మీరు నా పక్కనే ఉన్నారు.. జీవితంలో నా భాగస్వామిగా మిమ్మల్ని పొందినందుకు నేను నిజంగా కృతజ్ఞుడను.. మీరు మా జీవితాలకు వెలుగు. మీ దయ, ప్రజల పట్ల మీకున్న శ్రద్ధ, వ్యాపారం, ధాతృత్వం రెండింటిలోనూ మీ హృదయపూర్వక నాయకత్వం మా అందరికీ స్ఫూర్తినిస్తాయి’ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

అమ్మకు లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు..

మరోవైపు ఏపీ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ కూడా తన మాతృ‌మూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ‘అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్ చేశారు. ‘అమ్మ ప్రేమ, దయ, మద్దతు తనకు పెద్ద బలం... నా మార్గదర్శి.. ప్రజలకు సేవలు చేయడం, వ్యాపార చతురత, న్యాయం కోసం పోరాడటం పట్ల ఆమె చూపే అంకితభావం స్ఫూర్తిదాయకం... ప్రతిరోజూ అమ్మను ఆరాధిస్తాను.. ప్రేమతో తమ జీవితాలను ప్రకాశవంతం చేసిన ఆమె ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి’ అని కోరుకుంటూ నారా లోకేష్ పోస్ట్ చేశారు. లోకేష్‌తో పాటు ఆయన సతీమణి బ్రహ్మణీ, కుమారుడు దేవాన్ష్ కూడా భువనేశ్వరికి పుట్టునరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి:

యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన మోదీ

తిరిగి వచ్చే సమయం ఆసన్నమైంది..: బాలినేని

పిఠాపురం రోడ్డు ప్రమాద ఘటన బాధకలిగించింది: పవన్ కల్యాణ్

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 20 , 2025 | 09:54 AM