CM Chandrababu: చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌పై సీఎం చంద్రబాబు ట్వీట్
ABN, Publish Date - Jun 06 , 2025 | 02:47 PM
CM Chandrababu: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణం అద్భుతం అంటూ ప్రధాని మోదీకి సీఎం అభినందనలు తెలియజేశారు.
అమరావతి, జూన్ 6: జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ నదిపై నిర్మితమైన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈరోజు (శుక్రవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) జెండా ఊపి చీనాబ్ రైల్వే వంతెనను (Chenab Railway Bridge) ప్రారంభించారు. తాజాగా చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభోత్సవంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కొత్త రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంపై ప్రధానికి సీఎం అభినందనలు తెలియజేశారు. ప్రధాని నాయకత్వంలో కొత్త దశ మొదలైందని.. చీనాబ్ రైలు వంతెన ప్రపంచంలోనే ఎత్తైనదంటూ ముఖ్యమంత్రి కొనియాడారు.
చంద్రబాబు ట్వీట్
’జమ్మూకాశ్మీర్ అభివృద్ధిలో నూతన అధ్యాయం, ప్రధాని మోడీ నాయకత్వంలో కొత్త దశ మొదలైంది. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో నిర్మించబడిన అద్భుత నిర్మాణ శైలికి నిదర్శనంగా ఈ కట్టడం నిలుస్తుంది. ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన.. చీనాబ్ రైలు వంతెన. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు ఆర్చ్ వంతెనగా గుర్తింపు. భారతదేశంలోనే తొలి కేబుల్-స్టేయిడ్ రైలు వంతెన. అంజి బ్రిడ్జ్ భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేయిడ్ రైలు వంతెనగా నిలుస్తుంది. ఉధంపూర్ - శ్రీనగర్ - బారాముల్లా రైల్వే ప్రాజెక్టు (USBRL)పూర్తయిన తర్వాత ధార్మిక పర్యాటకానికి బలం చేకూరనుంది. ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఏ కాలానికైనా అనుకూలమైన రవాణా వ్యవస్థతో వందే భారత్ రైలు.. మాతా వైష్ణవి దేవి కట్రా – శ్రీనగర్ మధ్య నడవనుంది. ఈ నిర్మాణాలు దేశ గౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయి’ అంటూ సీఎం చంద్రబాబు ట్విట్ చేశారు.
ఇవి కూడా చదవండి
ముదిరిన వివాదం.. శాతవాహన కాలేజ్ నేలమట్టం
ఆర్సీబీకి పోలీసుల షాక్.. గట్టిగా బిగిస్తున్నారుగా..
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 06 , 2025 | 03:28 PM