Share News

Satavahana College: ముదిరిన వివాదం.. శాతవాహన కాలేజ్ నేలమట్టం

ABN , Publish Date - Jun 06 , 2025 | 11:06 AM

Satavahana College: విజయవాడలో శాతవాహన కాలేజ్ నేలమట్టం అవడం తీవ్ర కలకలం రేపుతోంది. కోర్టులో వివాదం నడుస్తుండగానే రాత్రికి రాత్రే బోయపాటి వర్గీయులు కాలేజీని నేలకూల్చారు.

Satavahana College: ముదిరిన వివాదం.. శాతవాహన కాలేజ్ నేలమట్టం
Satavahana College

విజయవాడ, జూన్ 6: నగరంలోని శాతవాహన కాలేజ్ (Satavahana College) వివాదం రోజు రోజుకు ముదురుతోంది. రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా కాలేజీని నేలమట్టం చేశారు. బోయపాటి అప్పారావు తన అనుచరులతో కలిసి కాలేజీ బిల్డింగ్‌ను కూలగొట్టించారు. కాలేజీ స్థలం తమది అంటూ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..


విజయవాడ నడిబొడ్డున విశాలాంధ్ర రోడ్డులోని శ్రీదుర్గామల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన శాతవాహన కాలేజీ ఉంది. ఈ కాలేజీ స్థలం తమదేనంటూ బోయపాటి అప్పారావు బోర్డులు పాతారు. ఈ వివాదం నేపథ్యంలోనే.. ఇటీవల కాలేజీ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్‌‌‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో.. శ్రీనివాస్‌ను నిందితులు వదిలేశారు. ఇప్పుడు బోయపాటి అప్పారావు తన అనుచరులతో వచ్చి కాలేజీనే కూలగొట్టించారు. బుల్డోజర్ల సహాయంతో కాలేజీ బిల్డింగ్‌లను నేలమట్టం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకుని, బుల్డోజర్లను స్వాధీనం చేసుకున్నారు.


మరోవైపు శాతవాహన కాలేజ్ కూల్చివేతపై ఎస్ఎఫ్ఐ విద్యార్ధి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పారావు చర్య కారణంగా కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆందోళనకు దిగారు. బిల్డింగ్ శిథిలాల కిందే విద్యార్ధులకు సంబంధించిన రికార్డులు ఉన్నాయని.. తమను ఆదుకోవాలంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఏళ్ల తరబడి కొనసాగుతున్న వివాదం..

బోయపాటి అప్పారావు నుంచి శ్రీ దుర్గామల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో విశాలాంధ్ర రోడ్డులో 5 ఎకరాల 16 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి సొసైటీ ప్రతినిధుల ఆధీనంలోనే ఈ స్థలం ఉంది. కొంతకాలం తరువాత ఈ స్థలం తనదేనంటూ బోయపాటి అప్పారావు ముందుకొచ్చాడు. దీంతో సొసైటీ కార్యదర్శి వంకాయలపాటి కామేశ్వరరావు స్థలం సొసైటీదేనంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. స్థలం సొసైటీకే చెందుతుందని తీర్పునిచ్చింది. హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ బోయపాటి అప్పారావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశం ఇప్పటికీ సుప్రీంకోర్టులోనే ఉంది.


ఇవి కూడా చదవండి

ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. లోన్లు తీసుకున్న వాళ్లకు ఇక పండగే..

ఆర్సీబీకి పోలీసుల షాక్.. గట్టిగా బిగిస్తున్నారుగా..

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 06 , 2025 | 12:23 PM