AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు
ABN, Publish Date - May 11 , 2025 | 12:27 PM
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు. ఇటీవల అరెస్ట్ అయిన కసిరెడ్టి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్ట్‌లో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో నిందితులు పేర్కొన్నారు.
అమరావతి: ఏపీ మద్యం కుంభకోణం కేసు (AP Liquor Scam Case)లో సిట్ (SIT) దూకుడు పెంచింది. నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి (Krishna Mohan Reddy), ధనుంజయరెడ్డి (Dhanunjaya Reddy), బాలాజీ గోవిందప్పలు (Balaji Govindappa) ఆదివారం విచారణకు హాజరు కావాలని ఇటీవల అధికారులు నోటీసులు (Notice) ఇచ్చిన విషయం తెలిసిందే. విజయవాడ సిట్ (SIT) కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే నిందితులు ఇంత వరకు సిట్ కార్యాలయానికి చేరుకోలేదు. అసలు వస్తారా, గైర్హాజరవుతారా అనే అంశాలపై అధికారులల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు వారి నుంచి ఎటువంటి సమాచారం రాలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ముగ్గురి ముందస్తు బెయిల్ పిటీషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
డబ్బులు వాళ్ల వద్దకే చేరాయి...
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు. ఇటీవల అరెస్ట్ అయిన కసిరెడ్టి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్ట్‌లో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో నిందితులు పేర్కొన్నారు. ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగానే వాళ్ల పేర్లు చేర్చినట్లు మెమోలో సెట్ అధికారులు పేర్కొన్నారు.
Also Read: ఎప్‌సెట్ ఫలితాలు విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డి
కాగా రాష్ట్రంలో పెను దుమారం రేపుతోన్న లిక్కర్ స్కాంకు సంబంధించి సిట్ ఇప్పటికే ఎంతో సమాచారాన్ని సేకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన పీఏ పైలా దిలీప్‌ను అరెస్ట్ చేసింది. వారిని కస్టడీలోకి తీసుకుని లిక్కర్ స్కాంకు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో మరికొన్ని అరెస్ట్‌లు కూడా జరిగాయి. ఈ కేసుకు సంబంధించి పలువురికి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు వారిని విచారించారు కూడా. లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ తమకు మధ్యంతర రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టులను కోరినప్పటికీ వారికి నిరాశే ఎదురైంది.
ఈ కేసు మొదలైనప్పుడే ఈ ముగ్గురు కూడా సుప్రీంను ఆశ్రయించారు. అయితే ఏపీ హైకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్నందున అక్కడ తేల్చుకుని రావాలని సుప్రీం సూచించింది. అయితే ఈ ముగ్గురు నిందితులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో వెంటనే వారు సుప్రీంలో పిటిషన్ వేశారు. మధ్యంతర రక్షణ కల్పించాలని కోరారు. అందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. గతంలో వేసిన పిటిషన్‌ను సవరణ చేయాలని లేదా కొత్త పిటిషన్‌ను వేయాలని సుప్రీం కోర్టు తెలియజేస్తూ విచారణను వాయిదా వేసింది. దీంతో ఈరోజు విచారణకు రావాలని నిందితులకు అధికారులు ఈ మేరకు నోటీసులు ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన డిప్యూటీ సీఎం పవన్
వీరజవాన్ మురళీ నాయక్‌కు లోకేష్ నివాళి
For More AP News and Telugu News
Updated Date - May 11 , 2025 | 12:40 PM