CM Chandrababu Yoga Campaign: యోగాపై ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్: చంద్రబాబు
ABN, Publish Date - Jun 19 , 2025 | 04:13 PM
CM Chandrababu Yoga Campaign: యోగా కోసం 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నామని.. కానీ 2.30 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారని సీఎం చంద్రబాబు తెలిపారు. 120 శాతం లక్ష్యం సాధించామని చెప్పుకొచ్చారు.
అమరావతి, జూన్ 19: 11వ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఈనెల 21న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తెలిపారు. గురువారం యోగాంధ్రపై ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. యోగా జీవితంలో భాగం కావాలన్నారు. ఇది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని తెలిపారు. శస్త్ర చికిత్స కన్నా నివారణ మంచిదని.. యోగా కూడా అలాంటిదే అని అన్నారు. యోగాపై భవిష్యత్తులో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ శిక్షణ, కోర్సులు నిర్వహిస్తామని చెప్పారు. యోగా నెలను డిక్లేర్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
యోగా కోసం 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నామని.. కానీ 2.30 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారన్నారు. 120 శాతం లక్ష్యం సాధించామని చెప్పుకొచ్చారు. 88.71 శాతం మంది ప్రజలు యోగాలో పాల్గొంటున్నారని వెల్లడించారు. విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవం పెద్ద ఈవెంట్‌గా నిర్వహించబోతున్నామని.. ఇది గిన్నిస్ బుక్‌లో ఎక్కబోతుందన్నారు. బాడీ ఫిట్‌నెస్‌కు, వ్యాధులు రాకుండా నిరోధించేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు. వ్యాధులు వస్తే మెడిసిన్స్ వాడటం, శస్త్ర చికిత్సలు చేయించుకోవడం మంచిది కాదన్నారు. గత నెల రోజుల నుంచి చేపట్టిన యోగా కార్యక్రమం బాగా జరిగిందన్నారు. దాదాపు 1 కోటి 77 లక్షల మంది వచ్చి యోగాలో పాల్గొన్నారని తెలిపారు.
గ్రామ, మండల స్థాయిలో పెట్టిన శిబిరాల్లో అందరూ పాల్గొన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి అనుకున్న యోగా కార్యక్రమాలు లక్ష్యాన్ని మించి సాధించామన్నారు. రాష్ట్రంలో 1 లక్ష 29 వేల ప్రాంతాల్లో యోగా చేస్తున్నారన్నారు. విశాఖలో 26 కిలోమీటర్లు పరిధిలో 3 లక్షల 19 వేల మంది యోగా చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖలో 326 కంపార్ట్‌మెంట్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రివెంటివ్ హెల్త్‌కు యోగా చాలా బెస్ట్ మెడిసిన్ అని.. దీనిని అందరూ అలవర్చుకోవాలని సూచించారు.
యోగా నిర్వహణకు యోగి 5 స్మార్ట్ మ్యాట్, యాప్ వచ్చిందన్నారు. మ్యాట్ టీచర్‌కు అసిస్టెంట్‌గా, విద్యార్థికి గైడ్‌లా పనిచేస్తుందని తెలిపారు. సీఎస్ఆర్ ద్వారా యోగాను జిల్లాల్లో ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. 'యోగా ఫర్ వన్ ఎర్త్-వన్ హెల్త్' నినాదంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెండు గిన్నిస్ బుక్ రికార్డుల కోసం కృషి చేస్తున్నామన్నారు. పెద్దసంఖ్యలో యోగాలో పాల్గొనడంలో రికార్డు సృష్టించబోతున్నామన్నారు. 3.50 లక్షల మందితో సూర్య నమస్కారాల కార్యక్రమం ఉంటుందన్నారు. రేపు 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాల కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మొత్తం 22 వరల్డ్ బుక్ రికార్డుల కోసం కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
నెల్లూరు రైల్వే కోర్టుకు మాజీ మంత్రి
జగన్ వ్యాఖ్యలపై నవ్వుకుంటున్నారు.. పట్టాభి సెటైర్
జగన్ పల్నాడు పర్యటనపై షర్మిల సంచలన కామెంట్స్
Read latest AP News And Telugu News
Updated Date - Jun 19 , 2025 | 06:03 PM