ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Gummidi Sandhyarani: ఏపీలో అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్స్ స్టవ్‌లు..

ABN, Publish Date - Jun 05 , 2025 | 02:03 PM

Minister Gummidi Sandhyarani: మినీ అంగన్‌వాడీలను పూర్తి స్థాయి అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదన చేశామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పిల్లల ఆరోగ్యమే ధ్యేయంగా పౌష్టికాహారం, రోజూ గుడ్డు, పాలు అందిస్తున్నామని అన్నారు. పాలు ఇరిగిపోతున్నాయన్న ఫిర్యాదులపై పాల పౌడర్లు అందించడం ప్రారంభించామని మంత్రి తెలిపారు.

Minister Gummidi Sandhyarani

Vijayawada: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు (Anganwadi Centres) 55,000 ఇండక్స్ స్టవ్‌లు (55,000 Indx Stoves), నాలుగు స్టీల్ పాత్రల చొప్పన పంపిణీ చేస్తున్నామని.. దీనివల్ల అంగన్‌వాడీ నిర్వహణలో 30 శాతం ఖర్చులు తగ్గుతున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (55,000 Indx Stoves) పేర్కొన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి ఫన్ టైమ్స్ క్లబ్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లల కోసం ఆట బొమ్మలు, మంచినీటి సదుపాయం, టాయిలెట్ శుభ్రత, కొత్త టీవీ కొనుగోలు కోసం రూ. 1 లక్ష నిధుల విడుదల చేసినట్లు చెప్పారు. మినీ అంగన్‌వాడీలను పూర్తి స్థాయి అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదన చేశామన్నారు. పిల్లల ఆరోగ్యమే ధ్యేయంగా పౌష్టికాహారం, రోజూ గుడ్డు, పాలు అందిస్తున్నామని తెలిపారు. పాలు ఇరిగిపోతున్నాయన్న ఫిర్యాదులపై పాల పౌడర్లు అందించడం ప్రారంభించామని తెలిపారు. అంగన్‌వాడీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ‘మా బిడ్డల్ని ఎలా చూసుకోవాలో మా ప్రభుత్వానికే తెలుసు’ అంటూ మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.


11,400 మందికి ఈరోజే ఇండక్స్ స్టవ్‌ల పంపిణీ..

11,400 మందికి ఈరోజే ఇండక్స్ స్టవ్‌లు పంపిణీ చేసామని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. అంగన్‌వాడీలకు సోలార్ పవర్ ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపామని.. త్వరలో ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు.

అలాగే రూ. 845 కోట్లతో విజయవాడ రైల్వేస్టేషన్ అభివృద్ధి జరుగుతుందని, రైల్వే స్టేషన్‌కు సంబంధించిన సరికొత్త డిజైన్లు విడుదల చేశామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఒకేసారి 20 వేల మంది ప్రయాణికులు వచ్చి వెళ్లేలా సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని, ఆధునికీకరణకు నీతి ఆయోగ్ ఆమోదం లభించిందని, 2 నెలల్లో అనుమతులు వస్తాయన్నారు. ఇటీవల కేటగిరి-1లోకి విజయవాడ రైల్వే స్టేషన్ చేరిందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.


అంగన్వాడీ కేంద్రాలకు త్వరలో టీచర్లు..

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలకు టీచర్ల నియామకం త్వరలో చేపట్టనున్నామని చెప్పారు. చిన్ననాటి నుంచే మానవీయ విలువలతో కూడిన విద్యా బోధన అందిస్తున్నామన్నారు. అంగన్‌వాడీలను ఆహ్లాదకర వాతావరణం కలిగినవిగా అభివృద్ధి చేస్తున్నామని, పచ్చదనం, ఆట వస్తువులతో పార్క్ మాదిరిగా రూపాంతరం చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పేదల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం అంకితం

కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం

For More AP News and Telugu News

Updated Date - Jun 05 , 2025 | 02:12 PM