పేదల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం అంకితం

ABN, Publish Date - Jun 05 , 2025 | 12:52 PM

PM Modi Tweet: పేదల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం అంకితమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్రంలో ఎన్డీయే పాలనకు 11 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు.

PM Modi Tweet: పేదల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం (NDA Government) అంకితమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. కేంద్రంలో ఎన్డీయే పాలనకు 11 ఏళ్లు (11 Years) పూర్తి అయిన సందర్భంగా మోదీ ట్వీట్ (Modi Tweet) చేశారు. ఈ 11 ఏళ్ల కాలంలో తాము సాధించిన విజయాలు 140 కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేశాయన్నారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో తమ ప్రయత్నాలతో లక్ష్యాన్ని అందుకోగలమన్న విశ్వాసాన్ని ప్రధాని మోదీ వ్యక్తం చేశారు.


ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక పథకాలన్నీ పేదల జీవితాలను మార్చాయని, గత దశాబ్దంలో ఎన్డీయే ప్రభుత్వం సాధికారత, మౌలిక సదుపాయాలు, సమ్మిళితత్వంపై దృష్టి సారించి, పేదరికం బారి నుండి అనేక మందిని బయటకు తీసుకురావడానికి విప్లవాత్మక చర్యలు తీసుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం

ప్రభాకర్ రావు విచారణపై సస్పెన్స్

For More AP News and Telugu News

Updated at - Jun 05 , 2025 | 12:52 PM