Jalaharati: జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
ABN, Publish Date - Jun 26 , 2025 | 11:02 AM
Jalaharati Corporation: తెలుగు రాష్ట్రాల్లో వివాదంగా మారిన బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం తాజాగా జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది.
Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ (Jalaharati Corporation Limited)ను ఏర్పాటు చేసింది. విజయవాడ (Vijayawada) కేంద్రంగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు (GO) జారీ చేసింది. ఇది పోలవరం (Polavaram)- బనకచర్ల (Banakacharla) నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్. అలాగే ఇతర ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేందుకూ పని చేస్తుంది. విజయవాడలో జలవనరుల శాఖ కార్యాలయంలో ‘జలహారతి’ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటైంది. బనకచర్లతోపాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేలా ఈ సంస్థకు బాధ్యతలు అప్పగించింది ఏపీ ప్రభుత్వం.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
కాగా, తెలుగు రాష్ట్రాల్లో పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ నీళ్లను ఏపీ దోచుకుపోవాలని చూస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టు కోసం తాజాగా జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ని ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి జలాలను రాయలసీమ, పల్నాడు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. అయితే దీనిపై తెలంగాణ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
100 శాతం ప్రభుత్వ నిధులతో ఏర్పాటు...
అమరావతి కేంద్రంగా పనిచేయనున్న ఈ సంస్థను 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్నట్టు సర్కార్ పేర్కొంది. ఈ సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఛైర్మన్‌గా, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వైస్ ఛైర్మన్‌గా, ముఖ్య కార్యదర్శి సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇవి కూడా చదవండి:
ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు..
విశాఖకు వస్తున్నాం..కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్
కూటమి ప్రభుత్వంపై జగన్ అక్కసు..
For More AP News and Telugu News
Updated Date - Jun 26 , 2025 | 12:03 PM