Cognizant: విశాఖలో దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్
ABN , Publish Date - Jun 26 , 2025 | 09:24 AM
Cognizant: విశాఖపట్నంలో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నామని కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తెలిపారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 22 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నామని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Amaravati: తమ తదుపరి గమ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అని (Visakhapatnam) కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్(Cognizant CEO Ravi Kumar) అన్నారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లోని 22 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ క్యాంపస్ (Cognizant IT Campus) ఏర్పాటు చేస్తున్నామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి సహకారం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
పెట్టుబడుల విస్తరణకు శ్రీకారం..

విశాఖపట్నంలో భారీగా పెట్టుబడుల విస్తరణకు శ్రీకారం చుడుతున్నట్లు దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ యాజమాన్యం ప్రకటించింది. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 22 ఎకరాల్లో ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దీని ద్వారా 8 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది. 2026 కల్లా కార్యకలాపాలు ప్రారంభించి 2029 నాటికి తొలిదశ పనులు పూర్తి చేస్తామంది. కాగా రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖకు మరో ప్రఖ్యాత ఐటీ కంపెనీ రానుంది. ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కాగ్నిజెంట్ ముందుకు వచ్చింది. రూ.1,582 కోట్ల పెట్టుబడితో 8,000 మంది యువతకు ఉద్యోగాలను కల్పించనుంది. ఈ మేరకు కాగ్నిజెంట్ పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఇప్పటికే టీసీఎస్...
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రూ.1,370 కోట్ల పెట్టుబడులతో 12,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా విశాఖలో కార్యాలయం స్థాపనకు టీసీఎస్ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీకి కూడా ఎకరా 99 పైసలు చొప్పున దాదాపు 22 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ కూడా విశాఖలో రూ.1,582 కోట్ల పెట్టుబడితో దశలవారీగా 8,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా క్యాంపస్ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది. ఈ సంస్థకు కూడా కాపులుప్పాడలో స్థలం కేటాయించాలని నిర్ణయించారు. వీఎంఆర్‌డీఏ ఇందుకు సానుకూలంగా స్పందించింది. విశాఖకు ఈ రెండు కంపెనీల రాకతోనే 20,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇన్ని వేలమంది ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలు విశాఖకు తరలి వస్తే నగర విస్తరణ, ఆర్థిక కార్యకలాపాలు ఏ స్థాయిలో పెరుగుతాయో ఊహించుకోవచ్చని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. కంపెనీల రాకతో విశాఖ నగరం రూపురేఖలు మారిపోతాయని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భౌగోళికంగా సముద్ర తీరాన ఉండటం, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానుండటం.. ఐటీ కంపెనీల రాకతో ముంబై తరహా కాస్మోపాలిటన్ సిటీగా విశాఖ మారుతుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
కూటమి ప్రభుత్వంపై జగన్ అక్కసు..
ఊబకాయం, మధుమేహం వారికి గుడ్ న్యూస్..
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
For More AP News and Telugu News