YCP: మరో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా
ABN, Publish Date - May 14 , 2025 | 08:15 AM
YCP: శాసన మండలిలో వైసీపీకి మరో వికెట్ డౌన్ అయింది. మండలి డిప్యూటీ చైర్మెన్‌గా ఉన్న జకియా ఖానమ్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. అకస్మాత్తుగా ఆమె రాజీనామా చేయడంతో పార్టీలో కలకలం రేగింది. తర్వాత ఆమె ఏ పార్టీలో చేరతారంటే..
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YSRCP Chief), మాజీ ముఖ్యమంత్రి (Ex CM) జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)కి ఆ పార్టీ ఎమ్మెల్సీ షాక్ (MLC shock) ఇచ్చారు. మండలి డిప్యూటీ చైర్ పర్సన్ (Council Deputy Chairperson) జాకీయా ఖానమ్ (Zakia Khanam) తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా (Resign) చేశారు. అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో పార్టీలో కలకలం రేగింది.
Also Read: తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..
కాగా శాసన మండలిలో వైసీపీకి మరో వికెట్ డౌన్ అయింది. మండలి డిప్యూటీ చైర్మెన్‌గా ఉన్న జకియా ఖానమ్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి సత్యకుమార్‌ను జాకీయా ఖానమ్ కలిసినట్లు తెలియవచ్చింది. కాగా మంగళవారం రాత్రి తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి మెయిల్‌లో పంపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన ఆ పార్టీలో ఉండేందుకు నేతలు ఇష్టపడడం లేదు. జగన్ తీరుతో ఒక్కొక్క నేత బయటకు వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం రాజీనామా చేసిన జాకియా ఖానమ్‌ను 2020 జులైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం అక్కర్లేదు
For More AP News and Telugu News
Updated Date - May 14 , 2025 | 11:19 AM