ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP Jagan: గజినీ జగన్‌

ABN, Publish Date - Jun 25 , 2025 | 05:10 AM

గతంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల పర్యటనలను నేను అడ్డుకున్నానా?.’’అంటూ గజినీలా మాజీ సీఎం జగన్‌ ప్రశ్నలు వేస్తున్నారు. ప్రజలు అన్నీ మరిచిపోయారనుకుని వైసీపీ అధినేత ఇష్టానుసారం అబద్ధాలు ఆడేస్తున్నారు.

బాబు, పవన్‌లను నాడు అడ్డుకోలేదట!

జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఆయన హక్కు అట!

తొక్కించి చంపిన వీడియో కనిపిస్తున్నా

సత్తెనపల్లి ఘటనపై జగన్‌ గలీజు కహానీ

ఆయన పర్యటనకు 679 మందితో భద్రత

కానీ, పోలీసుల సూచనలన్నీ బేఖాతరు

వాటిని ఆంక్షలుగా వక్రీకరించిన మాజీ సీఎం

  • జనాలను మభ్యపెట్టడానికి ప్రశ్నల డ్రామా

(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘‘గతంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల పర్యటనలను నేను అడ్డుకున్నానా?.’’అంటూ గజినీలా మాజీ సీఎం జగన్‌ ప్రశ్నలు వేస్తున్నారు. ప్రజలు అన్నీ మరిచిపోయారనుకుని వైసీపీ అధినేత ఇష్టానుసారం అబద్ధాలు ఆడేస్తున్నారు. ఏది చెప్పినా అమాయకంగా నమ్మేస్తారనుకుని సత్తెనపల్లి ఘటనపై గలీజు కహానీలు సొంత పత్రికలో వండి వార్చుతున్నారు. తాను సీఎంగా ఉండగా తిరుపతి.. విశాఖ... అనపర్తి.. అంగళ్లు.. ఇలా అప్పటి విపక్ష నేత చంద్రబాబును అడ్డుకోనిదెక్కడ? చివరికి ఉండవల్లి నివాసం నుంచి ఆయన బయటికి రాకుండా గేట్లకు తాళ్లు కట్టించిన అరాచకమూ, విపక్ష నేత ఇంటి దగ్గర వీరంగం చేసిన బీభత్స పాలన సైతం ప్రజలకు గుర్తుండదని జగన్‌ ఎలా అనుకుంటున్నారని నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నేను మాజీ సీఎంను. జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ నా హక్కు.’’ అని వైసీపీ అధినేత జగన్‌ సెలవిస్తున్నారు.

భద్రతను పోలీసులు కల్పించాలంటే వారిచ్చే సూచనలు నేతలు పాటించాలి కదా? సత్తెనపల్లి ఘటనలో పోలీసుల సూచనలను పట్టించుకోకపోగా, వాటిని ఆంక్షలుగా వక్రీకరించడం ఏమిటి? తన భద్రత గురించి గుండెలు బాదుకుంటున్న జగన్‌.. ఎన్‌ఎ్‌సజీ సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబుకు 2019లో భద్రత తగ్గించలేదా? ఉమ్మడి ఏపీ చివరి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి సెక్యూరిటీని కేవలం 2ప్లస్‌ 2కు జగన్‌ హయాంలోనే కదా కుదించింది?...సత్తెనపల్లి పర్యటనలో దళితుడు, తన పార్టీ కార్యకర్త సింగయ్యను బలితీసుకున్నది కాక.. చంద్రబాబుకు, పోలీసులకు ప్రశ్నలు అంటూ అబద్ధాలూ, నిందలు ప్రచారం చేయడం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు. అరాచక పాలన ఐదేళ్లూ కొనసాగించి, అమరావతి మహిళలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. అలాంటి జగనేనా రెడ్‌బుక్‌ పాలన అంటూ గుండెలు బాదుకుంటున్నదని ఆశ్చర్యపోతున్నారు. సత్తెనపల్లి ఘటన, అక్కడ చోటుచేసుకున్న మరణాలపై చర్యలు తీసుకుంటున్న పోలీసులకు మాజీ సీఎం హోదాలో సహకరించాల్సిన ఆయన.. అన్యాయం, కుట్ర, కుతంత్రం అంటూ సోమవారం చంద్రబాబు, పోలీసులకు ప్రశ్నలు సంధించారు. ఒక్కో ప్రశ్నను ప్రస్తావిస్తూ మాజీ సీఎంను నెటిజన్లు సోషల్‌ మీడియాలో ఏకిపారేశారు.

జగన్‌: గతంలో చంద్రబాబుగానీ, పవన్‌కల్యాణ్‌ గానీ తిరుగుతున్నప్పుడు ఇలాంటి ఆంక్షలు మేం ఎప్పుడైనా పెట్టామా?

జవాబు: సీఎంగా మీరు ఉన్నప్పుడు అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లకుండా అడ్డుకుని డీఎస్పీ సుధాకర్‌ రెడ్డి అవమానించలేదా? తిరుపతి విమానాశ్రయంలో ఎనిమిది గంటలపాటు నిర్బంధించలేదా? టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి కుమారుడి పెళ్లికి నర్సీపట్నం వెళుతుంటే విశాఖపట్నంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మీ పార్టీ మూకలు వీరంగం సృష్టించలేదా? అనపర్తి నియోజకవర్గంలో లారీలు అడ్డుపెట్టి చీకట్లో చంద్రబాబును నడిపించలేదా? ఉండవల్లి నివాసం నుంచి ఆయన బయటికి రాకుండా గేట్లకు తాళ్లు కట్టి నిర్బందించలేదా? అంగళ్లులో అరాచకం సృష్టించిందెవరు..కేసులు నమోదు చేసింది ఎవరిపైన.? హైకోర్టు అనుమతితో అమరావతి సాధన కోసం అప్పట్లో ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా రైతుల్ని నెల్లూరు జిల్లాలో అడ్డుకుని మీ నేత కాకాని గోవర్ధన్‌ రెడ్డి వేధింపులకు గురి చేయలేదా? ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై అప్పట్లో మీ నేత జోగి రమేశ్‌ దాడి చేయలేదా? జనవాణి పేరుతో విశాఖపట్నం వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ను హోటల్‌ నుంచి బయటికి రాకుండా అడ్డుకోలేదా? అర్ధరాత్రి ఆయన పార్టీ కార్యకర్తలు 70మందిని పోలీసు బెల్టులతో కొట్టించి హత్యాయత్నం కేసులు పెట్టించలేదా? ఇప్పటం గ్రామానికి వెళుతుంటే పవన్‌పై ఆంక్షలు పెట్టలేదా? సొంత రాష్ట్రంలోకి వస్తున్న జనసేన అధ్యక్షుడిని రాష్ట్ర సరిహద్దుల్లో రోడ్డుపై కూర్చోబెట్టలేదా? హత్యకు గురైతే దళిత యువతి రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న లోకేశ్‌ను పోలీసు జీపు ఎక్కించి కృష్ణాజిల్లాలోని మారుమూల పోలీసు స్టేషన్‌కు తరలించలేదా.? యువగళం పాదయాత్రని ఇబ్బంది పెట్టలేదా?

జగన్‌: జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని, డ్రైవర్‌ను ప్రభుత్వమే ఇవ్వాలి.. ప్రొటోకాల్‌ మీరు పాటించకపోవడంతో సొంత డబ్బుతో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కొని, మీరు ఇచ్చిన డ్రైవర్‌తోనే నడిపిస్తున్నా. మాజీ సీఎం వాహన రక్షణ బాధ్యత మీది కాదా?.

జవాబు: మాజీ ముఖ్యమంత్రి హోదాలో బుల్లెట్‌ ప్రూఫ్‌ సఫారీ వాహనాన్ని ఏర్పాటుచేస్తే తిరస్కరించింది మీరు కాదా.? మీ సొంత డబ్బుతో కొనుక్కున్నానని చెబుతున్న ఫార్చూనర్‌ కారు యజమానిగా మీ పేరు లేదు. మీరు అత్యంత నిజాయితీపరుడిగా కితాబిచ్చిన మీ మాజీ ఓఎ్‌సడీ పేరుతో ఉంది. ఆయనకు మీరిచ్చే జీతం ఎంత.? ఆయన ఆదాయం ఎంత.? దళితుడిని తొక్కించి ప్రాణాలు తీయించిన మీ కారు నడుపుతున్న డ్రైవర్‌ వెంకట రమణారెడ్డి ఎన్ని సంవత్సరాలుగా మీదగ్గర ఉన్నారు.? పోలీసు ట్రాన్స్‌పోర్టు సిబ్బంది తరచూ తీసుకునే మధ్యంతర శిక్షణకు ఆయనను మీరు పంపారా.? మీరు ఎంపీగా ఉన్నప్పటి నుంచీ పదేళ్లకుపైగా మీ వద్ద ఆయన్ను పెట్టుకున్నారంటే సమర్ధవంతమైన డ్రైవర్‌ అనా.? లేక సామాజిక వర్గం చూశారా?.

జగన్‌: ప్రతిపక్షంగా ఉన్నందున మీ వాగ్దానాలు, హామీలు, మేనిఫెస్టో, పాలనా వైఫల్యాలు, రెడ్‌ బుక్‌ రాజ్యాంగం, అవినీతిపై నేను ప్రెస్‌ మీట్లు పెట్టి ప్రశ్నిస్తే.. తట్టుకోలేక డైవర్షన్‌ రాజకీయాలు చేయడం అత్యంత హేయకరం. కాస్తయినా సిగ్గు తెచ్చుకుని మారండి.

జవాబు: ప్రతిపక్ష హోదాకు కూడా మీరు పనికి రారంటూ ప్రజలు ఇచ్చిన తీర్పును ఏడాదిలోపే మరిచిపోతే ఎలా?. కూటమి పాలనలో వైఫల్యాలు ప్రశ్నిస్తామంటున్న మీరు అరాచకపాలనకు బ్రాండ్‌ అంబాసిడర్‌. రాష్ట్రంలో ప్రజలు ఏడాదిగా ప్రశాంతంగా జీవిస్తున్నారు. అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తున్నందువల్లే ఓఎ్‌సడీ, కార్యదర్శి, పార్టీ ప్రధాన కార్యదర్శి వరుసగా జైలు పాలయ్యారు. మీ హయాంలో ఒక్క నోటిఫికేషన్‌ కూడా వెయ్యకుండా, ఏపీపీఎ్‌ససీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడి యువత జీవితాలతో ఆడుకుని ఇప్పుడు నీతికబుర్లు చెప్పడమే అత్యంత హేయం. ప్రజలు మీపై ప్రేమ చూపిస్తే కనీసం ప్రతిపక్ష హోదా వచ్చేది. ఉండేది.. ఇలాంటి మాటలు చెప్పేందుకు మీకుండాలి సిగ్గు!.

జగన్‌: సత్తెనపల్లి పర్యటన నుంచి తిరిగొచ్చేటప్పుడు ప్రమాదం గురించి మా పార్టీ నాయకులు నాకు చెప్పారు. అప్పటికే మా వాళ్లు ఆసుపత్రికి చేరుకున్నారు. బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయల సహాయం అందించాం. యజమానిని కోల్పోయిన కుటుంబం పట్ల మా బాధ్యతను చేతనైనంతగా నిర్వర్తించాం.. మరణించిన వ్యక్తి మా అభిమాని. అయినా మాపై విష ప్రచారాలు చేస్తున్నారు.. మానవత్వం, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం.

జవాబు: కారు కింద రాయి పడితేనే డ్రైవర్‌కు తెలుస్తుంది.. అలాంటిది వ్యక్తి చనిపోతే తిరిగొచ్చే వరకూ మీ డ్రైవర్‌, ఆ వాహనంలో ఉన్న నేతలు మీకు చెప్పలేదా.? ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రుడిని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోకుండా ఆసుపత్రికి తరలించి ఉంటే ప్రాణాలు నిలిచేవేమో కదా. బాధిత కుటుంబానికి పది లక్షలు సాయం చేశామని చెబుతున్న మీరు సింగయ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు?

జగన్‌: జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ప్రజల తాకిడి ఉన్నప్పుడు రోప్‌ పార్టీలు, పైలట్‌ వాహనాలు ఎందుకు లేవు.? ఉండుంటే వాహనం కింద ఎవరైనా ఎలా పడగలుగుతారు.?

జవాబు: జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీలో ఉండే మాజీ ముఖ్యమంత్రి పోలీసులు చేసే సూచనలు పాటించాలి. వాటిని ఆంక్షలుగా వక్రీకరించి ప్రభుత్వం, పోలీసులపై బురద జల్లడమే పనిగా మీరు పెట్టుకున్నారు. సత్తెనపల్లి పర్యటనకు 100మందిని మాత్రమే అనుమతిస్తాం.. కాన్వాయ్‌తో పాటు మూడు కార్లే ఉండాలని జిల్లా ఎస్పీ చెప్పినా ఎందుకు పాటించలేదు? నేరుగా రెంటపాళ్లకు వెళ్లమని కోరితే గుంటూరు బై పాస్‌ మీద వాహనాలు ఆపి దళితుడిని కారుతో తొక్కించింది మీరు కాదా.? సత్తెనపల్లిలో మీ పర్యటన బందోబస్తుకు 679మంది పోలీసు సిబ్బంది ఉంది.. పదిహేను రోప్‌ పార్టీలు కూడా ఉన్నాయి.. అలాగని తాడేపల్లి నుంచి రెంటపాళ్ల వరకూ దారి పొడవునా మీ కారు ముందు నుంచి రోప్‌ పార్టీతో పరుగులు తీయంచగలరా.?

Updated Date - Jun 25 , 2025 | 05:50 AM