Rains: రాష్ట్రంలో భారీ వర్షాలు..
ABN, Publish Date - Jun 12 , 2025 | 04:18 PM
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
విశాఖపట్నం, జూన్ 12: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. అలాగే ఉత్తర కోస్తా, దక్షిణ ఓడిశాలో ప్రసుత్తం ఉపరితల ఆవర్తనం విస్తరించిందని తెలిపింది. ఈ ప్రభావం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
అలాగే కోస్తా ఆంధ్రాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని చెప్పింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందంది. ఈ సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ సూచించింది.
మరో వైపు అనుకున్న సమయానికంటే ముందే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. దీంతో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. అయితే ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉండడంతో.. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రయాణీకుల సమాచారం కోసం హెల్ప్‌లైన్ నెంబర్ ఇదే..
For Andhrapradesh News And Telugu News
Updated Date - Jun 12 , 2025 | 04:20 PM