Ahmedabad Plane Crash: 242 మంది మృతి.. ప్రయాణీకుల సమాచారం కోసం హెల్ప్‌లైన్ నెంబర్ ఇదే..
ABN , Publish Date - Jun 12 , 2025 | 03:54 PM
గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లో టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కూలి 242 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. ప్రయాణీకుల సమాచారం కోసం 1800 5691 444 అనే ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్‌ను అధికారులు ఏర్పాటు చేశారు.
గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం.. టేకాఫ్ అయిన కేవలం కొన్ని నిమిషాలకే కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో 230 మంది ప్రయాణికులు , 12 మంది సిబ్బంది మరణించారని సమాచారం. ఇందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ వారు, 1 కెనడియన్, 7 మంది పోర్చుగీస్ జాతీయులు ఉన్నారు. గాయపడిన వ్యక్తులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రయాణీకుల సమాచారం కోసం 1800 5691 444 అనే ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.