Minister Satya Kumar: వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్
ABN, Publish Date - Apr 18 , 2025 | 02:09 PM
Minister Satya Kumar: వైసీపీపై మంత్రి సత్య కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మదనపల్లి రికార్డ్స్ దగ్ధం కేసులో త్వరలో మరిన్ని వివరాలు బయటకు వస్తాయని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా: టీటీడీ గోశాల లాంటి సున్నితమైన అంశాన్ని వైసీపీ నేతలు రాజకీయాల్లోకి లాగుతున్నారని మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టిని మరల్చి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ(శుక్రవారం) మడకశిరలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, సత్య కుమార్ యాదవ్, సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడారు. మూడు నెలల్లో 44 ఆవులు చనిపోయాయనేది వాస్తవం...అవి కూడా అనారోగ్య , వయసు రీత్యా చనిపోయినవేనని అన్నారు. వేల ఆవులు ఉన్న చోట ఇలాంటివి సహజమని చెప్పారు. గోశాలలో ఏం జరుగుతుందో చూపిస్తామంటే వైసీపీ నాయకులు ఇంటి దగ్గర పడుకొని డ్రామాలు ఆడుతున్నారని మంత్రి సత్య కుమార్ యాదవ్ విమర్శలు చేశారు.
నెయ్యి విషయంలో కూడా త్వరలో వివరాలు రాబోతున్నాయని చెప్పారు. కల్తీ మద్యంలో ఎవరైతే భాగస్వాయం ఉన్నారో వారంతా బయటకు వస్తారని అన్నారు. 2500 గోవులకు జియో ట్యాగ్‌లు వేశామని స్పష్టం చేశారు. క్విడ్ ప్రోకోలో భాగంగా దాల్మియా సిమెంట్స్ నుంచి రూ.720 కోట్ల హవాలా మార్గంలో జగన్‌కి వచ్చాయని.. అందుకే ఈడీ ఆస్తులు అటాచ్ చేస్తుందని అన్నారు. మదనపల్లి రికార్డ్స్ దగ్ధం కేసులో త్వరలో మరిన్ని వివరాలు బయటకు వస్తాయని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణలో ఎమ్మెస్ రాజు పోరాటం మరువలేనిదని తెలిపారు. కోడికత్తి, గుండె పోటు విషయాల్లో వైసీపీ ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేశారో అందరికీ తెలుసునని మంత్రి సత్యకుమార్ విమర్శించారు.
లిక్కర్ స్కాంపై సమగ్ర విచారణ: మంత్రి అనగాని సత్యప్రసాద్
మడకశిరలో 50 ఎకరాల్లో డిఫెన్స్ పరిశ్రమ రాబోతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఒకే రోజు 4 కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభించి మరో 3 సబ్ స్టేషన్ల ఏర్పాటుకు మంత్రులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములపై, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం... లిక్కర్ స్కాంపై సమగ్ర విచారణ జరుపుతున్నామని చెప్పారు. పీ4 లాంటి అద్భుతమైన కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అభివృద్ధి దిశగా జిల్లాను ముందుకు నడుపుతున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
ఇవి కూడా చదవండి
Jagan Big Shock: జగన్‌కు భారీ ఎదురు దెబ్బ
Police Case: భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు
Cool Drink Incident: అసలేం తినేటట్టు లేదు.. తాగేట్టూ లేదుగా
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 18 , 2025 | 02:14 PM