ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: మహిళాభివృద్ధితోనే సమాజాభివృద్ధి

ABN, Publish Date - Mar 08 , 2025 | 08:15 AM

CM Chandrababu: మహిళ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోందని iఉద్ఘాటించారు.

CM Chandrababu Naidu

అమరావతి: మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల బలాన్ని, శక్తిని సూచిస్తుందని తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, మాతృసమానులైన మహిళామణులకు శుభాకాంక్షలు చెప్పారు. మహిళా దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ కాదు... ఇది సమాజ బాధ్యత అని ఉద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.


బడ్జెట్‌లో మహిళలలకు ప్రాధాన్యం..

మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళాభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. తాజాగా 2025- 26 వార్షిక బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా రూ.4,332 కోట్లు కేటాయించడం ద్వారా వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. అలాగే 'దీపం 2' స్కీమ్ కింద 90.1 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని వివరించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అంగన్‌వాడీ సెంటర్ల బలోపేతం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్దితో పనిచేస్తున్నామని అన్నారు. మహిళాభివృద్ధితోనే సమాజాభివృద్ధి అని బలంగా నమ్మి పనిచేస్తున్నామని తెలిపారు. మహిళల భద్రత, గౌరవం, సాధికారతకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఈరోజు(శనివారం) సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యుల్ ఖరారైంది. మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా మార్కాపురానికి సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. 10:45 గంటలకు తర్లుపాడు రోడ్డులోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 10:45 నుంచి 10:55 గంటల మధ్య ప్రజాప్రతినిధులు, ఇతరుల నుంచి వినతులు స్వీకరిస్తారు. 10:55 నుంచి11:15 మధ్య జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 12:20 నిమిషాలకు స్టాల్స్ సందర్శన, రుణాల పంపిణీ, పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఒంటి గంట నుంచి 2:30‌ గంటల మధ్య మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 2:35 గంటల నుంచి 4:05 గంటల మధ్య టీడీపీ కార్యకర్తలతో సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. 4:05 గంటల నుంచి 4:30 గంటల వరకు జిల్లా అధికారులతో సమావేశం ఉంటుంది. సమావేశం అనంతరం హెలికాప్టర్ ద్వారా సీఎం చంద్రబాబు ఉండవల్లి బయలుదేరి వెళ్లనున్నారు.


మహిళా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి: నారా లోకేష్

సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా శక్తి అపారమని... సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే అద్భుతంగా రాణిస్తారని అన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నామని చెప్పారు. మహిళా సంక్షేమం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక, ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. తమ తమ రంగాల్లో మహిళలు మరిన్ని విజయాలను సాధిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu Naidu: మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా ఏపీ

Venkaiah Naidu: ఉన్నత విద్యలో మార్పుతోనే దొరస్వామికి నివాళి

Power Tariff: విద్యుత్‌ ట్రూ అప్‌ పాపం వైసీపీదే

Read Latest AP News and Telugu News

Updated Date - Mar 08 , 2025 | 08:27 AM