AP EAPCET 2025: 7.30 గంటల్లోపే పరీక్షా కేంద్రాలకు
ABN, Publish Date - May 26 , 2025 | 03:12 AM
కడపలో మహానాడు సందర్భంగా 4 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయే అభ్యర్థులు ఉదయం 7.30లోపే చేరుకోవాలని సూచించారు. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నారు.
కడపలో ఏపీఈఏపీసెట్ అభ్యర్థులకు సెట్ చైర్మన్ సూచన
జేఎన్టీయూకే, మే 25(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా పబ్బాపురంలో రేపటి నుంచి టీడీపీ మహానాడు జరగనున్న దృష్ట్యా ఆ జిల్లాలోని 4 కేంద్రాల్లో ఏపీఈఏపీసెట్‌కు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 7.30 గంటలలోపే చేరుకోవాలని ఈఏపీ సెట్ చైర్మన్ సీఎస్‌ఆర్కే ప్రసాద్ సూచించారు. కడపలోని కందుల ఓబుల్‌రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అన్నమాచార్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్, కేఎస్‌ఆర్‌ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కేఎల్‌ఎం కాలేజ్ ఫర్ ఉమెన్స్‌ల్లో ఈఏపీసెట్ ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందన్నారు.
Updated Date - May 26 , 2025 | 03:14 AM