K Dhanunjaya reddy: ధనుంజయ్ రెడ్డి అక్రమాలపై ఆరా
ABN, Publish Date - May 18 , 2025 | 08:20 PM
K Dhanunjaya reddy: జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని తానై వ్యవహరించినట్లు విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనగారి అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో ఆయన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
అమరావతి, మే 18: జగన్ ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు రిటైర్డ్ ఐఏఎస్ కె. ధనుంజయ్ రెడ్డితోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డిలను సిట్ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి మద్యం కుంభకోణంలోనే కాకుండా.. మరిన్ని అక్రమాలపై చేసి ఉండవచ్చే అభిప్రాయం సర్వత్ర వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా వాటిపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. అలాగే భూ బాగోతంలో సైతం ధనుంజయ్ రెడ్డి పాత్రపై కూటమి ప్రభుత్వం కూపీ లాగుతోంది.
మరోవైపు అరెస్టయిన అవినీతి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్ రెడ్డిని పరామర్శించేందుకు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు రావడం పట్ల ఆశ్చర్యంగా ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. నాటి ప్రభుత్వ పెద్దల అవినీతితో లింకులు ఉండడం వల్లే ధనుంజయ్ రెడ్డిని పరామర్శించేందుకు సదరు పార్టీ నేతలు క్యూ కడుతున్నారనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ధనుంజయ్ రెడ్డి బాధిత ఐఏఎస్‌లను సమాచారాన్ని రాబట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అదీకాక వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సీనియర్ అధికారుల విషయంలో నిర్లక్ష్యం.. అలాగే జూనియర్ల విషయంలో వివక్షతో ధనుంజయ్ రెడ్డి వ్యవహరించారనే అభియోగాలున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం తాను చెప్పినట్టే చేయాలన్నట్లుగా ధనుంజయ్ రెడ్డి వ్యవహరించారనే ఓ చర్చ సైతం సాగింది.. సాగుతోంది. ఇంకా చెప్పాలంటే.. సీఎస్‌ను కూడా ధనుంజయ్ రెడ్డి వెయిట్ చేయించారనే ఆరోపణలున్నాయి.
ఇంకా చెప్పాలంటే.. ఐఏఎస్ కెరీర్ సర్వనాశనం అయ్యేలా ధనుంజయ్ రెడ్డి వ్యవహరించారంటూ ఐఏఎస్ వర్గాల్లో ఓ చర్చ అయితే వాడి వేడిగా నడుస్తోంది. ఉత్తరాంధ్రలో సదరు ఐఏఎస్ అధికారి ఇంటిని ఉన్న పళంగా ఖాళీ చేయించి రాక్షసానందం పొందాడంటూ ధనుంజయ్ రెడ్డిపై విమర్శలున్నాయి. అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ అధికారిపై కక్ష కట్టి పోస్టింగ్ నుంచి తప్పించేలా ధనుంజయ్ రెడ్డి వ్యవహరించారని ఆరోపణలు కూడా ఉన్నాయి.
అదే విధంగా తన మాట వినని అధికారులపై ఆయన బదిలీ అస్త్రం ప్రయోగించే వారని ఐఏఎస్‌లు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌లకు కీలక పోస్టింగుల నుంచి తప్పించి తన వారికే ధనుంజయ్ రెడ్డి ఇప్పించారని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి ధనుంజయ్ రెడ్డి పాత్రపై కూపీ లాగేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
AP Capital: అమరావతికి మరో మణిహారం
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన
Fire Accident: పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత
For AndhraPradesh News And Telugu News
Updated Date - May 18 , 2025 | 08:20 PM