AP Capital: అమరావతికి మరో మణిహారం
ABN , Publish Date - May 18 , 2025 | 07:35 PM
AP Capital: రాజధాని అమరావతి ప్రాంతంలో సెమీ హైస్పీడ్ సర్క్యూలర్ రైలును నడిపేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులోభాగంగా రాజధాని ప్రాంతంలో ఈ రైలు నడిపేందుకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి, మే 18: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. అందులోభాగంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో సెమీ హై స్పీడ్ సబర్బన్ సర్క్యులర్ రైలు కోసం కసరత్తు ప్రారంభమైంది. విజయవాడ – నంబూరు – అమరావతి – గుంటూరు - తెనాలి - విజయవాడ మధ్య ఈ సెమీ హై స్పీడ్ సర్క్యులర్ సబర్బన్ రైల్వే సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని.. తద్వారా ఈ ప్రాంతంలో కనెక్టివిటీతోపాటు ట్రాఫిక్ సదుపాయాలను మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ ఒక మార్గాన్ని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (APMRC) "అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీ లిమిటెడ్" (UMTC)ని ఈ సబర్బన్ రైలు సేవల కోసం సాధ్యాసాధ్యాలపై పూర్తి ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదివారం ఆదేశించింది. విజయవాడ, గుంటూరు ప్రధాన నగరాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) పరిధిలో.. అలాగే అమరావతి చుట్టూ అభివృద్ధి కేంద్రాలైన కృష్ణా కాలువ, దుగ్గిరాల, తెనాలి, వెజెండ్ల, మంగళగిరి, సతెనపల్లి, నూజివిడి, గుడివాడ, గన్నవరం ఉన్నాయి.
ప్రస్తుతం గుంటూరు నుంచి విజయవాడ వరకు 32.17 కిమీ దూరాన్ని ప్రయాణించే ఒక ప్యాసింజర్ రైలు 1. 20 గంటలు పడుతుందనీ రైల్వే శాఖ అంచనా వేస్తున్నారు. ఇక ఇదే దూరానికి ఎక్స్‌ప్రెస్ రైలు గంట సమయం పడుతుందని భావిస్తున్నారు. హౌరా - చెన్నై ఈస్ట్ కోస్ట్ కారిడార్ పూర్తి స్థాయిలో బిజీగా ఉంది. బ్రాంచ్ లైన్లలో కొన్ని ట్రైన్లు మాత్రమే ఉన్నాయి. అవి మిక్స్‌డ్ ట్రాఫిక్‌తో నెమ్మదిగా నడుస్తున్నాయని గుర్తించారు.
అయితే అమరావతి చుట్టు పక్కల ప్రాంత ప్రయాణికుల కోసం వేగవంతమైన ప్యాసింజర్ రైలు సేవలను నడిపించడం సాధ్యం కాదనీ ఇప్పటికే రైల్వే శాఖ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతీయ హబ్ అభివృద్ధికి వేగవంతమైన సెమీ హై స్పీడ్ సబర్బన్ రైలు వ్యవస్థ అవసరమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. అటు భారత ప్రభుత్వం (రైల్వే మంత్రిత్వ శాఖ) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు జాయింట్ వెంచర్ మోడల్‌లో సబర్బన్ రైల్వే పాలసీ- 2017 కింద చేపట్టాలని నిర్ణయించింది.
సెమీ హై స్పీడ్ సర్క్యులర్ సబర్బన్ రైలు..
విజయవాడ
PNBS స్టేషన్
కృష్ణా కాలువ
పెద్దవడ్లపూడి
చిలువురు
దుగ్గిరాల
కొలకలూరు
తెనాలి
సంగం
వెజెండ్ల
ఓల్డ్ గుంటూరు
గుంటూరు
కోరిటపాడు
హిందూ కాలేజ్ హాస్టల్
గుంటూరు నగరం
ఎం.జి. ఇనర్ రింగ్ రోడ్డు
ఆటో నగర్
నంబూరు
కాజా
మంగళగిరి
తాడికొండ
పెద్దపరిమి
రిజర్వాయర్ తదితర ప్రాంతాల మధ్య నడిచేందుకు ఫిసిబిలిటీపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది.
For AndhraPradesh News And Telugu News