ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu Security: సీఎం చంద్రబాబు భద్రతపై డీజీపీ కీలక ఆదేశాలు

ABN, Publish Date - May 08 , 2025 | 06:35 PM

CM Chandrababu Security: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు భద్రతపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు.

CM chandrababu naidu

అమరావతి, మే 08: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇంటలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఉన్నతాధికారులను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. సెక్యురిటీ ప్రొటోకాల్స్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని.. ఎక్కడా రాజీ పడ వద్దని ఉన్నతాధికారులకు ఆయన కీలక సూచన చేశారు. అలాగే జన సమూహంలోకి ముఖ్యమంత్రి వెళుతున్న సమయంలో పాటించాల్సిన నిబంధనలు, ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని జిల్లాల ఎస్పీలను ఆయన ఆదేశించారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి డీజీపీ హరీష్ కుమార్ తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. సామాన్య ప్రజలు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన మేర భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులకు సిఎం చంద్రబాబు సూచించారు.


పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకార చర్యలకు భారత్ దిగిన సంగతి తెలిసిందే. అనంతరం వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలు, ప్రజలు, సంస్థల రక్షణతోపాటు వీఐపీల భద్రతపై గురువారం అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ప్రస్తుత పరిస్థితులతోపాటు తదుపరి తీసుకోవాల్సిన భద్రత చర్యలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి ఇంటిలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హాతోపాటు పలువురు కీలక ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రత విషయంపై కీలక సమీక్ష నిర్వహించారు.


పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ క్రమంలో బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదు స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మంది వరకు మరణించినట్లు కేంద్రం ప్రకటించింది. భారత్ తీసుకున్న ఈ చర్యలు అనంతరం కేంద్రం హోం మంత్రి అమిత్ షా.. అన్ని రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు కేంద్ర మంత్రి అమిత్ షా పలు కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

HYDRAA: హైడ్రా అంటే కొందరికి కడుపు మంట: సీఎం రేవంత్‌ రెడ్డి

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో స్కై స్ట్రైకర్స్ కీలకం

Operation Sindoor: ఈ పాపకు ఆ తల్లిదండ్రులు ఏం పేరు పెట్టారో తెలుసా..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన పహల్గాం మృతుడి భార్య

Updated Date - May 08 , 2025 | 06:36 PM