ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu Naidu: ఇంధన సంస్థల డైరెక్టర్‌ అభ్యర్థులతో మాట్లాడతా

ABN, Publish Date - Apr 18 , 2025 | 04:52 AM

ఇంధన రంగ సంస్థల డైరెక్టర్ల నియామకం పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపికైన అభ్యర్థులతో మౌఖిక ఇంటర్వ్యూల అనంతరం నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.

ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటా

మంత్రి గొట్టిపాటి బృందానికి సీఎం చంద్రబాబు స్పష్టత

డిస్కమ్‌ల సీఎండీ నియామకాలపైనా త్వరలో నిర్ణయం

అమరావతి, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): ఇంధన సంస్థలు ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో, ఏపీఈపీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌, సీపీడీసీఎల్‌లో 17మంది డైరెక్టర్ల నియామకంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపికైన అభ్యర్థులను తన ముందుకు తీసుకురావాలని, వారితో మాట్లాడాకే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం తనను కలిసిన విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌, సీఎంవో కార్యదర్శి రాజమౌళిలకు తెలిపారు. ఈ సందర్భంగా మౌఖిక ఇంటర్వూల అనంతరం ఎంపికైన వారి జాబితాను వీరు సీఎంకు అందజేశారు. దీంతో డైరెక్టర్ల నియామకం ఇప్పట్లో తేలేలా లేదన్న అభిప్రాయం మంత్రి బృందానికి ఏర్పడిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. డైరెక్టర్‌ అభ్యర్థులకు సీఎం ప్రత్యేకంగా సమయం ఇస్తేనే గానీ మాట్లాడేందుకు వీలుండదు. ఇంధన రంగంలో నిష్ణాతుడైన చంద్రబాబు.. డైరెక్టర్లకు ఒక విధంగా మౌఖిక పరీక్ష నిర్వహించబోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ జెన్కోలో 5, ట్రాన్స్‌కోలో ఒకటి, ఎస్పీడీసీఎల్‌, సీపీడీసీఎల్‌లలో 4 చొప్పున, ఈపీడీసీఎల్‌లో 3 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టుల కోసం ఇటీవల జరిగిన మౌఖిక ఇంటర్వూలకు 148 మంది హాజరయ్యారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ మెరిట్‌ లిస్టులో ఉన్నవారి జాబితాను సిద్ధం చేశారు. డైరెక్టర్‌ పోస్టులను భర్తీ చేయాలంటూ మంత్రి గొట్టిపాటిపై ఒత్తిడి పెరుగుతోంది. ఎస్పీడీసీఎల్‌ సీఎండీగా పుల్లారెడ్డిని, సీపీడీసీఎల్‌ సీఎండీగా సంతో్‌షరావును నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈపీడీసీఎల్‌ సీఎండీ పృధ్వీతేజ్‌ను కూడా బదిలీ చేసే వీలుందని ప్రచారం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల

AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 04:52 AM