ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu Naidu: జగన్‌లాంటి అడ్డగోలు సీఎంను ఎన్నడూ చూడలేదు

ABN, Publish Date - Jun 26 , 2025 | 04:36 AM

‘‘నా జీవితంలో జగన్‌ లాంటి అడ్డగోలు ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా విధ్వంసం చేసి పెట్టారని నిప్పులు చెరిగారు.

  • ఐదేళ్లలో చేయకూడని అకృత్యాలు ఎన్నెన్నో చేశారు.. రాష్ర్టాన్ని అన్ని విధాలా విధ్వంసం చేసి వెళ్లారు

  • పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఓ కేస్‌ స్టడీ.. పాలకులు ఎలా ఉండకూడదో జగన్‌ ఓ కేస్‌ స్టడీ

  • పవన్‌, మోదీ, నేను కలిశాం.. చెడుపై విజయాన్ని సాధించాం.. ‘సంవిధాన్‌ హత్య దివ్‌స’లో సీఎం

  • రాష్ర్టాన్ని అన్ని విధాలా విధ్వంసం చేసి వెళ్లారు: సీఎం

విజయవాడ, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): ‘‘నా జీవితంలో జగన్‌ లాంటి అడ్డగోలు ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా విధ్వంసం చేసి పెట్టారని నిప్పులు చెరిగారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో బుధవారం నిర్వహించిన ‘సంవిధాన్‌ హత్య దివస్‌’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పాలన ఎలా ఉండకూడదో నాటి ఎమర్జెన్సీ ఒక కేస్‌ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదో 2019-24లో రాష్ట్రంలోని పాలకులు(వైసీపీ) ఒక కేస్‌ స్టడీ. చెడు చేసిన వారిని తరిమి కొట్టడమే నిజమైన ప్రజాస్వామ్యం.

ఉమ్మడి ఏపీలో నేను 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశా. నా రాజకీయ జీవితంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశా. కానీ, 2019-24 మధ్య చూసిన ముఖ్యమంత్రి వేరు. ఒక ముఖ్యమంత్రి ఇలా కూడా చేయగలుగుతాడా అని ఆశ్చర్యం వేసింది. ఐదేళ్లపాటు అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, ఎవరు గొంతు విప్పినా నులిమేయటం, కబ్జాలు, మోసాలు, బెదిరింపులు, దాడులు, ఆస్తులు రాయించుకోవటం వంటివి జరిగాయి. గత పాలన వల్ల చాలా నష్టపోయాం. నేనేమైనా ఫర్వాలేదు. నన్ను అభిమానించిన తెలుగు ప్రజానీకం కోసం తెలుగు రాష్ర్టాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో రాజీలేకుండా పోరాడాం. ఇదే సమయంలో మిత్రుడు పవన్‌ కల్యాణ్‌ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాపాడుకోవాలని పవన్‌, నేను, నరేంద్ర మోదీ అందరం కలిసి ముందుకు వచ్చాం. అందరం కలిసి విధ్వంసం నుంచి ఈ రాష్ర్టాన్ని పునర్నిర్మాణం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలో వచ్చాం. తొలిఏడాదిలోనే సుపరిపాలనలో తొలి అడుగు వేశాం’’ అని చంద్రబాబు అన్నారు.

ఓటే ఆయుధం

‘‘దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు అయింది. ఇప్పుడు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఇన్ని దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో మలుపులు, సవాళ్లు ఎదురయ్యాయి. విజయాలు సాధించాం. కానీ, ఎమర్జన్సీ తర్వాత చీకటి నెలకొంది. ఎమర్జన్సీ ఒక చీకటి అధ్యాయం. గతం ఎప్పుడూ మరిచిపోకూడదు. మంచి రోజులే కాకుండా చీకటి రోజులను కూడా గుర్తుకు పెట్టుకుంటే ఏది మంచి, ఏది చెడో తెలుస్తుంది. ముఖ్యంగా రాజకీయాలలో, ప్రజాజీవితాలలో ఉండే మాపై ఎంతో బాధ్యత ఉంది.’’ అని చంద్రబాబు చెప్పారు. ‘‘అహంభావం.. నాకు ఎదురు లేదన్న గర్వంతో ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. పత్రికలపై సెన్సార్‌ పెట్టారు. జర్నలిస్టులను అరెస్టు చేశారు. రాజకీయాల్లో అహం భావం ఉండకూడదు. బలవంతంగా కుటుంబ నియంత్రణ చేపట్టారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా వనరులు పెరగవేమోనని నేను కూడా గతంలో ఫ్యామిలీ ప్లానింగ్‌ పాటించమని చెప్పా. దీంతో పదేళ్ల పాటు జనాభా తగ్గింది. ఆ రోజున జనాభా కంట్రోల్‌లోకి వచ్చింది. కానీ, ఈ రోజు మళ్లీ తగ్గింది. అందుకే పిల్లల్ని కనమని చెబుతున్నా. ఇదే ప్రజాస్వామ్యం.’’ అని చంద్రబాబు అన్నారు.

అలా వెళ్లి.. ఇలా వచ్చేసరికి!

‘‘1984, ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు గుండె ఆపరేషన్‌ చేయించుకునేందుకు అమెరికా వెళ్లి తిరిగి వచ్చే సరికి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా ఆయన ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ భర్తరఫ్‌ చేయించారు. ప్రజాస్వామ్యవాదులు ఎన్టీఆర్‌తో కలిసి 30 రోజుల పాటు ప్రజా ఉద్యమం చేయడం ద్వారా ఇందిరాగాంధీ మెడలు వంచి మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగారు. ఇదీ ప్రజాస్వామ్యం. కొంతమంది నాయకులు చెడు చేసినా.. అది తాత్కాలికం. అలాంటి వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.’’ అని చంద్రబాబు అన్నారు.

జగన్‌ క్షిపణి రక్షణ కోరతారేమో!: సత్య

వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఐదేళ్లు అప్రకటిత ఎమర్జెన్సీ నడిచిందని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. కేంద్రం చొరవతో కరోనాను రాష్ట్రం నుంచి ఆరు నెలల్లో పారదోలామని, కానీ, దానిని మించిన వైసీపీవైర్‌సను ఐదేళ్లు భరించామని విమర్శించారు. ఘోర ఓటమి తర్వాత కూడా వైసీపీ ఆత్మవిమర్శ చేసుకోకుండా పాత ధోరణిలోనే వ్యవహరిస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌కి జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పించినా.. భద్రతా వైఫల్యం ఉందని చెబుతున్నారని, ఆయనను ఇలాగే వదిలేస్తే తనకు ఎస్‌-400 క్షిపణులతో రక్షణ కల్పించమనే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. మంత్రి కందుల దుర్గేశ్‌ మాట్లాడుతూ, అధికార కాంక్షతోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు.

Updated Date - Jun 26 , 2025 | 04:36 AM