Tirupati Case: వృద్ధురాలిది హత్యే.. తేల్చేసిన తిరుపతి పోలీసులు
ABN, Publish Date - Apr 30 , 2025 | 04:01 PM
Tirupati Case: తిరుపతిలో ఇటీవల జరిగిన వృద్ధురాలు శాంతమ్మ మృతిని పక్కా హత్యగా పోలీసులు నిర్ధారించారు. సంపద కోసమే వృద్ధురాలిని హత్య చేసినట్లు గుర్తించారు.
తిరుపతి, ఏప్రిల్ 30: జిల్లాలోని జీవకోనలో జరిగిన వృద్ధురాలి మృతిపై పోలీసులు పురోగతి సాధించారు. ఈనెల 11న జీవకోన, రాఘవేంద్ర నగర్‌లో సిరివెళ్ల శాంతమ్మ (64) అనే వృద్ధురాలి మృతి తీవ్ర కలకలం రేపింది. అయితే అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా.. పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు బయటపడ్డాయి. సిరివెళ్ల శాంతమ్మది హత్యే అని పోలీసులు తేల్చేశారు. డబ్బును కాజేసేందుకు వృద్ధురాలిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ హత్యలో ఐదుగురిని నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి రూ.13 లక్షల విలువగల 129 గ్రాముల బంగారం, వెండి నగలు, రూ.35 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం ఈరోజు (బుధవారం) మీడియా సమావేశం నిర్వహించి.. శాంతమ్మ హత్యకు సంబంధించిన వివరాలు.. ఎందుకు హత్య చేశారో తెలియజేశారు. నిందితుల్లో ఏ1, ఏ2లు వృద్ధురాలు ఉండే భవనంలో రెండవ అంతస్థులో అద్దెకు ఉన్నారు. ఈ క్రమంలో నాలుగవ అంతస్థులో నివాసముంటున్న యజమాని శాంతమ్మతో చనువుగా ఉన్నారు.
Weather Alert: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఆమె వద్ద భారీగా బంగారం, నగదును గుర్తించిన నిందితులు శాంతమ్మను హత్య చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో పథకం ప్రకారమే హత్య చేసి ఆపై దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. హత్య అనంతరం ఇంటిలో ఉన్న బంగారు నగలు, డబ్బు తీసుకుని నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. చివరకు శాంతమ్మను డబ్బుకోసం దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారించారు.
నిందితులు వీరే
A1. బిజిలి జగదీష్
A2. ఉయ్యాల హర్షిత
A3. బండి పవన్ కుమార్
A4. జమ్మలమడుగు శశిరేఖ
A5. గూడూరు మురళిగా గుర్తించారు.
వీరిలో ఏ1గా ఉన్న బిజిలి జగదీష్‌పై కిడ్నాప్, హత్యా నేరాల కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఉయ్యాల హర్షిత తండ్రిపై 17 ఎర్రచందనం కేసులు ఉన్నట్లు వెల్లడించారు. నిందితులను తిమ్మినాయుడుపాలెం బస్ స్టాప్ వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టు చేసి వారిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం మీడియా సమావేశంలో పేర్కొన్నారు .
ఇవి కూడా చదవండి
PM Modi: గోడ కూలి ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం..
Modi Amaravati Visit: ప్రధాని పర్యటన ఏర్పాట్లు పూర్తి.. ఆ రెండే కీలకమన్న మంత్రి
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 30 , 2025 | 04:04 PM