AP NEWS: ఏపీలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు చివరకు..
ABN, Publish Date - May 18 , 2025 | 07:35 AM
Tirupati Tragic Accident:ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఓ కారు అకస్మాత్తుగా బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.
తిరుపతి: ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. బావిలోకి కారు దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా (Annamaya District) పీలేరు మండలం బాలమువారిపల్లి పంచాయతీ పరిధిలోని కురవపల్లి వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రం కోలార్కుకు చెందిన శివన్న, లోకేష్, గంగరాజులు ఏపీకి వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చారు. పనులు ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. అయితే ఈ కారులో ఐదుగురు వ్యక్తులు ఉండగా ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో శివన్న, లోకేష్, గంగరాజులు మరణించారు. గాయపడ్డ మరో ఇద్దరిని స్థానిక ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కోలార్కులో ఉన్న కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించారు. సమాచారం అందడంతో వారు ఏపీకి బయలుదేరారు. కుటుంబ సభ్యులు మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. మృతదేహాలను బావిలో నుంచి వెలికి తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
Road Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Nara Lokesh: ఏపీకి మీ ఆశీస్సులు అందించండి
Governor Abdul Nazir: ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా ఏపీ
For More AP News and Telugu News
Updated Date - May 18 , 2025 | 08:12 AM