Road Accident: తిరుపతి జిల్లా అగరాల వద్ద రోడ్డు ప్రమాదం.
ABN, Publish Date - May 12 , 2025 | 09:07 AM
Road Accident: పౌర్ణమి నేపథ్యంలో తిరువన్నామలైకు ఆర్టీసీ డిపో ఎక్కువ బస్సులను నడుపుతోంది. ఒక రోజు ముందే వెళితే గిరి ప్రదర్శన చేసుకునే అవకాశం ఉంటుందని భక్తులు తిరుపతి నుంచి ఎక్కువగా వెళుతుంటారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో తిరువన్నామలై నుంచి తిరుపతికి వస్తున్న క్రమంలో చంద్రగిరి మండలం, అగరాల సమీపంలో బస్సు కల్వర్టును ఢీ కొట్టింది.
తిరుపతి జిల్లా: చంద్రగిరి మండలం (Chandragiri Mandal), అగరాల సమీపంలో పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి (National Highway)పై సోమవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. చంద్రగిరి మండలం, అగరాల పంచాయతీ, నారాయణ కళాశాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు (Tamilnadu)లోని తిరువన్నామలై (Tiruvannamalai) నుండి తిరుపతి (Tirupati)కి వస్తున్న తిరుమల డిపో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొంది (RTC Bus Crash). ఈ ఘటనలో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సోమవారం పౌర్ణమి నేపథ్యంలో తిరువన్నామలైకు ఆర్టీసీ డిపో ఎక్కువ బస్సులను నడుపుతోంది. ఒక రోజు ముందే వెళితే గిరి ప్రదర్శన చేసుకునే అవకాశం ఉంటుందని భక్తులు తిరుపతి నుంచి ఎక్కువగా వెళుతుంటారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో తిరువన్నామలై నుంచి తిరుపతికి వస్తున్న క్రమంలో చంద్రగిరి మండలం, అగరాల సమీపంలో బస్సు కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.
Also Read: సినీ నటుడు మహేష్ బాబుకు మరోసారి ఈడీ నోటీసులు..
మరోవైపు అల్లూరి జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. బావ గెన్ను.. బావ మరుదులను బల్లెంతో పొడిచి హతమార్చాడు. తన సోదరి (అక్కను) సక్రమంగా చూసుకోవడం లేదని బావమరుదులు కిమ్ముడు కుంజు, కృష్ణ.. బావను ప్రశ్నించారు. తననే ప్రశ్నిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన బావమరుదులపై బళ్లెంతో దాడి చేసి హతమార్చాడు. దాడి చేసే క్రమంలో రాజు అనే వ్యక్తి అడ్డు కొన్నాడు. అతనికి కూడా గాయాలు అయ్యాయి. దీంతో అతనిని ఆస్పత్రికి తరలించారు. అల్లూరి జిల్లా, జీకే వీధి మండలం, సీనియర్ మీదిరి పంచాయితీ పరిధి జీడీపీ క్యాంపులో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
టిబెట్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
For More AP News and Telugu News
Updated Date - May 12 , 2025 | 09:07 AM