Baby Kits Back: బేబీ కిట్స్ పథకం పునరుద్ధరణ
ABN, Publish Date - May 07 , 2025 | 03:56 AM
మళ్ళీ బేబీ కిట్స్ పథకం ప్రారంభం కానుంది. బాలింతలకు అవసరమైన 11 వస్తువులతో కూడిన కిట్స్ పంపిణీకి సీఎం ఆమోదం
ఆరోగ్యశాఖకు సీఎం పచ్చజెండా
బేబీ కిట్స్ పథకం పునరుద్ధరణ
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): గతంలో అత్యంత ప్రజాదరణ పొందిన బేబీ కిట్‌ల పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో ఆరోగ్యశాఖ చేసిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు మంగళవారం ఆమోందించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బాలింతలకు బేబీ కిట్‌లను ప్రభుత్వాసుపత్రల్లో అందించేవారు. 2014-19 మధ్య ఈ పథకాన్ని మంచి ఆదరణ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని రద్దు చేసింది. కాగా, ఈ పథకానికి అవసరమైన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాలని ఆరోగ్య మంత్రి చేసిన ప్రతిపాదనను సీఎం ఆమోదించారు. నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉద్దేశించిన 11వస్తువులతో కూడిన ప్రతి బేబీ కిట్‌కు రూ.1,410లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ పథకం కింద దోమల తెరతో కూడిన బేబీ బెడ్, వాటర్ ప్రూఫ్ కాట్‌షీట్, బేబీ డ్రస్, వాషబుల్ నేప్కిన్స్, టవల్, బేబీ పౌడర్, బేబీ షాంపూ, బేబీ ఆయిల్, బేబీ సోప్, సోప్ బాక్స్, బేబీ రాటిల్ టాయ్ అందిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
PAN Card: పాన్ కార్డులో ఎవరికైనా తండ్రి పేరే ఉంటుంది.. ఎందుకో తెలుసా..
Security Mock Drill: హైదరాబాద్‌లోని ఆ నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్.. ఎప్పుడంటే..
India - Pakistan war: యుద్ధానికి సిద్ధమా.. తర్వాత పరిస్థితి ఏమిటి
Minister Satya Kumar: వైద్యులపై హెల్త్ మినిస్టర్‌కు ఫిర్యాదు.. విచారణకు ఆదేశం
CM Chandrababu: ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్
For Andhrapradesh News And Telugu News
Updated Date - May 07 , 2025 | 03:56 AM