Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి
ABN, Publish Date - May 10 , 2025 | 05:54 AM
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపించాలని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు రైల్వే మంత్రిని కోరారు. జలంధర్, జమ్ము, కురుక్షేత్ర, చండీగఢ్‌ల నుంచి తెలుగు రాష్ట్రాలకు రైళ్లు ఏర్పాటు చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు
రైల్వే మంత్రికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు వినతి
న్యూఢిల్లీ, మే 9(ఆంధ్రజ్యోతి): భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాలైన హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, జమ్ముకశ్మీర్‌ల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు విజ్ఞప్తి చేశారు. జలంధర్, జమ్ము, కురుక్షేత్రల్లోని నిట్ క్యాంప్‌సలతో పాటు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అత్యధిక మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. వారంతా స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు ఢిల్లీ, చండీగఢ్ నుంచి తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు నడపాలని కోరుతూ రైల్వే మంత్రికి శుక్రవారం రాసిన లేఖలో ఎంపీ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్
పాక్ దాడులపై ఎక్స్‌లో భారత ఆర్మీ పోస్ట్
For More AP News and Telugu New
Updated Date - May 10 , 2025 | 05:54 AM