ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Lokesh:‘కాలేజీలు ఖాళీ’ అంటూ ప్రచారం.. మంత్రి లోకేష్ మాస్ వార్నింగ్

ABN, Publish Date - Jul 28 , 2025 | 04:43 PM

కూటమి ప్రభుత్వంపై వైసీపీకి చెందిన మీడియా అసత్య కథనాలు వండి వారుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ కాస్తా ఘాటుగా స్పందించారు.

AP Minister Nara Lokesh

అమరావతి, జులై 28: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పని తీరునే లక్ష్యంగా చేసుకొని వైసీపీ ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తోంది. ఆ క్రమంలో వివిధ అంశాలపై అవాస్తవాలను కథనాల రూపంలో వైసీపీకి చెందిన మీడియా ప్రచురిస్తోంది. తాజాగా అటువంటి చర్యలే ఆ పార్టీ మీడియా పాల్పడింది. దీనిపై సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.

జగన్మోహన్ రెడ్డి అవినీతి విష పుత్రిక, రోత పత్రిక సాక్షిలో ఈ రోజు కాలేజీలు ఖాళీ అంటూ అబద్ధాలను వండి ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యలో గత ఏడాది కాలంగా మేము తెచ్చిన సంస్కరణల కారణంగా 2025-26 విద్య సంవత్సరంలో దాదాపు 18 శాతం మేర అడ్మిషన్లు పెరిగాయి. UDISE డేటా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ నెల 31వ తేదీ వరకు అడ్మిషన్లు కొనసాగుతాయి.

ప్రకాశం జిల్లా కనిగిరి వంటి మారుమూల ప్రాంతాల్లోని కళాశాలల్లో సైతం అడ్మిషన్లు రెట్టింపు కావడం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనం. విద్యార్థులు, అధ్యాపకుల్లో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే తప్పుడు రాతలపై ప్రభుత్వం చట్ట పరంగా చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు వైసీపీ మీడియా, నేతలపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌‌ను లక్ష్యంగా చేసుకుని పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు పి. నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో ఈ ప్రతినిధి బృందం పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. జులై 31వ తేదీన ఈ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు బృందం స్వదేశానికి తిరిగి రానుంది.

మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి పట్టం కడుతూ ఆంధ్రప్రదేశ్ ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దీంతోొ చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పలు కుంభకోణాలను వెలికి తీసే ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం చేపట్టంది. అలాంటి వేళ.. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని వైసీపీకి చెందిన మీడియా అస్యత కథనాలకు తెర తీసిందనే వాదన వినిపిస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

నాగ పంచమి రోజు.. జస్ట్ ఇలా చేయండి..

సింగపూర్‌లో రెండో రోజు.. సీఎం బిజీ బిజీ

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 28 , 2025 | 06:43 PM