ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MEPMAAP: పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ABN, Publish Date - Jun 08 , 2025 | 08:38 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007 జులైలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఏర్పాటు అయింది.

MEPMAAP

అమరావతి, జూన్ 08: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలనపై గతేడాది కాలంగా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)కు ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డులు వరించాయి. వివిధ కేటగిరీల్లో నామినేట్ అయిన 14 ప్రాజెక్టులకుగాను 9 ప్రాజెక్ట్స్‌కు ప్లాటినం అవార్డులు దక్కించుకుంది. పట్టణ ప్రాంతాల మహిళలకు సాధికారత కల్పించడంలో ఏపీ మెప్మా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

వివిధ పథకాల ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పిస్తూ.. ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది. నివాసం, బ్యాంక్ లింకేజి ప‌థ‌కాలు, లైవ్ లీ హుడ్ ట్రాక‌ర్, ఈ - కామ‌ర్స్ అమ్మ‌కాలు, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్, జీవ‌నోపాధి యూనిట్లు, ప్రేర‌ణ స‌ఖి, వీధి వ్యాపారుల మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం, దుర్బ‌ర జీవితాన్ని గ‌డిపే వారిని ఆర్ధికంగాపైకి తీసుకువ‌చ్చే ప‌థ‌కాల‌కు ఈ అవార్డుల వచ్చాయి.

ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన న్యూఢిల్లీలో జరిగే సదస్సులో స్కాచ్ ప్లాటినం అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్.. ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డులు దక్కినందుకు సీఎం చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణతోపాటు ఇతర ఉన్నతాధికారులకు మెప్పా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ ధన్యవాదాలు తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007 జులైలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఏర్పాటు అయింది. నగరపాలిక, పురపాలక సంస్థల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లోని మహిళలతో సంఘాలను ఏర్పాటు చేసి వారికి పొదుపుతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

హే మహాత్మా.. గాంధీ ఆసుపత్రిలో నీళ్లు కట కట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 08 , 2025 | 08:42 PM