Share News

AP EAPCET Result: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

ABN , Publish Date - Jun 08 , 2025 | 06:16 PM

ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ (ఏపీఈఏపీ సెట్) ఫలితాలను విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది.

AP EAPCET Result: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
AP EAPCET 2025 Result

అమరావతి, జూన్ 08: ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ (ఏపీ ఈఏపీసెట్) ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. మరోవైపు జేఎన్టీయూ కాకినాడ వీసీ ప్రొ. సీఎస్ఆర్‌కే ప్రసాద్ తన కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో తెలంగాణకు చెందిన ఎ.అనిరుధ్ రెడ్డి మొదటి ర్యాంకు.. శ్రీకాళహస్తికి చెందిన ఎం. భానుచరణ్ రెడ్డి రెండో ర్యాంకు.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కె. వై. సాత్విక్‌ మూడో ర్యాంకు సాధించారు.

ఇక మహానందికి చెందిన రాంచరణ్ రెడ్డికి నాలుగో ర్యాంకు, అనంతపూర్‌కు చెందిన భూపతి నితిన్ అగ్రిహోత్రికి ఐదో ర్యాంకు, గుంటూరుకు చెందిన విక్రమ్‌కు ఆరో ర్యాంకు, చిత్తూరుకు చెందిన మణిదీప్ రెడ్డికి ఏడో ర్యాంకు, తెలంగాణ హన్మకొండకు చెందిన షాగంటి త్రిశూల్‌కు ఎనిమిదో ర్యాంకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన జ్ఞాన రుత్విక్ సాయికి తొమ్మిదో ర్యాంకు, నెల్లూరు జిల్లా సాయి మణి ప్రీతమ్‌‌ పదో ర్యాంకు కైవసం చేసుకున్నారు.


ఇక అగ్రికల్చరల్, ఫార్మసీలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన వారు..

అగ్రికల్చరల్‌లో కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన వెంకట నాగసాయి హర్షవర్ధన్ మొదటి ర్యాంకు సాధించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన షణ్ముఖ నిషాంత్ రెడ్టి రెండో ర్యాంకు, ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన డేగల వినయ్ మల్లేష్ కుమార్ మూడో ర్యాంకు సాధించారు.

  • ఏపీ ఈఏపీసెట్ 2025కు నిర్వహించిన పరీక్షల్లో ఇంజనీరింగ్ విభాగానికి మొత్తం 2.64 లక్షల మంది హాజరయ్యారు. 1.8 లక్షల మంది అర్హత సాధించారు. 71.65 శాతం మంది పాసయ్యారు.

  • అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో నిర్వహించిన పరీక్షల్లో 75.4 వేల మంది హాజరయ్యారు. వారిలో 67.7 శాతం మంది అర్హత సాధించారు. 89.8 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ర్యాంక్ కార్డుల కోసం ఈ కింద లింక్‌పై క్లిక్ చేయాలి..

    cets.apsche.ap.gov.in/EAPCET

  • అలాగే వాట్సప్ నెంబర్: 9552300009 ద్వారా పొందవచ్చు.

పరీక్ష ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetResult.aspx


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతి మహిళలపై వ్యాఖ్యలు.. బాధ్యులపై కఠిన చర్యలు

కిషన్ రెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్యే రాజా సింగ్ పరోక్ష విమర్శలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 08 , 2025 | 07:23 PM