Gandhi Hospital:హే మహాత్మా.. గాంధీ ఆసుపత్రిలో నీళ్లు కట కట
ABN, Publish Date - Jun 08 , 2025 | 07:54 PM
పంచ భూతాల్లోనే కాదు.. పంచామృతంలో ఒకటి. నీరు. అలాంటి నీరు మనిషికి ప్రాణాధారం. ఆ నీరే లేకుంటే మనిషి పరిస్థితి అగమ్య గోచరమే. నీరు లేకుంటే.. అదీ కూడా అందుబాటులో లేకుంటే.. మనిషి బతుకు అల్లకల్లోమే. తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అంతటి ప్రతిష్టాత్మకమైన గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం పలు ప్రాంతాల నుంచి రోగులు తరలి వస్తారు. అయితే ఆసుపత్రిలో మంచి నీరు లేకుండా పోయింది. దీంతో అనార్యోగంతో ఆసుపత్రికి వస్తున్న రోగులు.. మంచి నీటి కోసం పడుతోన్న ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. ప్రభుత్వాసుపత్రుల్లో మందులు లేవంటే.. గతంలో బయట కొనుకోచ్చేవారమని రోగులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం మందుల సంగతి దేవుడెరుగు.. మంచి నీళ్లు సైతం లేక పోవడంతో వాటిని సైతం బయట కోనుగోలు చేసుకో వాల్సి వస్తుందని రోగులు చెబుతుండడం గమనార్హం.
1/11
హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో మంచి నీళ్లు నిండుకొన్నాయి.
2/11
వాటర్ ట్యాప్ వద్ద మంచి నీళ్ల కోసం ప్రయత్నిస్తున్న యువకుడు.
3/11
ఆసుపత్రిలో నీళ్లు లేక పోవడంతో.. బయట నుంచి వాటర్ బాటిల్ కొనుగోలు చేసుకు వచ్చిన రోగి బంధువు
4/11
వాటర్ బాటిల్ కోనుగోలు చేసుకు వస్తున్న వ్యక్తి
5/11
ఆసుపత్రి బయట నుంచి వాటర్ బాటిల్ కోనుగోలు చేసుకు వస్తున్న మహిళ
6/11
మంచి నీళ్ల కోసం వాటర్ ట్యాప్ తిప్పితే... నీళ్లు రావడం లేదు.
7/11
బయట నుంచి వాటర్ బాటిళ్లు కొనుగోలు చేసుకు వస్తున్న మహిళలు, పురుషులు
8/11
వాటర్ బాటిల్తో ఆసుపత్రి లోకి వస్తున్న యువతి
9/11
బయట కొనుగోలు చేసుకు వచ్చిన వాటర్ బాటిల్ నీళ్లు తాగుతోన్న మహిళ
10/11
ఆసుపత్రి బయట ముఖం కడుకొని తిరిగి ఆసుపత్రికి వస్తున్న మహిళలు
11/11
బయట వాటర్ బాటిల్ కొనుక్కోని ఆసుపత్రిలోకి వస్తున్న యువతి
Updated at - Jun 08 , 2025 | 08:40 PM