AP summer water shortage: వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు: సీఎస్
ABN, Publish Date - Apr 18 , 2025 | 04:32 AM
వేసవిలో తాగునీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. 332 మండలాల్లో 3,438 ఆవాసాలను గుర్తించి, రూ.67.31 కోట్లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్లు చెప్పారు.
అమరావతి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎక్కడా వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి వేసవి కార్యాచరణ, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘వేసవిలో నీటి ఎద్దడికి అవకాశమున్న 332 మండలాల్లోని 3,438 ఆవాసాలను గుర్తించి, రూ.67.31 కోట్లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. కరువు ప్రభావిత మండలాల్లో ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేయాలి. అవసరమైతే ప్రైవేట్ తాగునీటి వనరులను అద్దెకు తీసుకుని, ప్రజల అవసరాలు తీర్చాలి. నీటి పథకాలు, బావులు, చేతి పంపులకు రిపేర్లు చేయాలి. జిల్లా, రాష్ట్ర స్థాయిలో మానటరింగ్ సెల్స్ ఏర్పాటు చేసి, తాగునీటిపై ప్రసార మాధ్యమాలతో పాటు టోల్‌ఫ్రీ నంబరు 1902 ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సమస్యల్ని పరిష్కరించాలి. పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి ఇబ్బంది రాకుండా చూడాలి. జలవనరులశాఖ సమన్వయంతో కాలువలకు అడ్డుకట్ట వేసి, అన్ని సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్ని, చెరువుల్ని నీటితో నింపాలి. విద్యుత్ అంతరాయాలతో నీటి సరఫరాకు ఆటంకం లేకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచాలి’ అని సీఎస్ ఆదేశించారు. ప్రతి నెలా స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని నిర్వహించి, కార్యాలయ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల
AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..
AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్
Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..
Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
For AndhraPradesh News And Telugu News
Updated Date - Apr 18 , 2025 | 04:32 AM