AP DSC Hall Ticket 2025: ఏపీ మెగా డీఎస్సీ.. హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
ABN, Publish Date - May 30 , 2025 | 05:07 PM
ఏపీ మెగా డీఎస్సీ 2025 హాల్ టికెట్లు నేడు విడుదల కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు apdsc.apcfss.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
AP DSC Hall Ticket 2025: ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ఏపీ డీఎస్సీ 2025 హాల్ టిక్కెట్లను నేడు తన అధికారిక పోర్టల్ https://apdsc.apcfss.in ద్వారా విడుదల చేయనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీతో లాగిన్ అయి వారి హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షల షెడ్యూల్
AP DSC 2025 నియామక పరీక్ష జూన్ 6 నుండి జులై 6, 2025 వరకు సీబీటీ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా ఏపీ విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 16,347 పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేయనుంది. స్కూల్ అసిస్టెంట్ (SA), సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT), శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) ,ప్రిన్సిపాల్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పరీక్షకు 5.6 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది.
AP DSC అడ్మిట్ కార్డ్ 2025 apdsc.apcfss.in లో అధికారులు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అధికారిక AP DSC పోర్టల్‌ను సందర్శించండి: https://apdsc.apcfss.in
హోమ్‌పేజీలో "డౌన్‌లోడ్ హాల్ టికెట్" లింక్‌పై క్లిక్ చేయండి.
మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.
మీ హాల్ టికెట్‌ను యాక్సెస్ చేయడానికి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
హాల్ టికెట్ PDF ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సిన పత్రాలు
AP DSC 2025 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఈ క్రింది పత్రాలను తీసుకెళ్లాలి.
AP DSC అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) హార్డ్ కాపీ
రెండు ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ID. ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్.
ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీను జూలై 8న విడుదల చేస్తారు. ఫలితాలు జులై 2025 చివరి వారంలో వెలువడే అవకాశం ఉంది.
Also Read:
లిక్కర్ స్కాంలో నిందితుల విచారణ.. సిట్ ప్రశ్నలు ఇవే
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
For More Telugu News
Updated Date - May 30 , 2025 | 05:52 PM