ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YCP Attack: ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్ శివకుమార్‌పై వైసీపీ దాడి

ABN, Publish Date - Jul 09 , 2025 | 03:07 PM

బంగారుపాలెం జగన్ పర్యటనలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి చిత్తూరు డిప్యూటీ చీఫ్ ఫొటోగ్రాఫర్ శివ కుమార్‌పై దాడి చేశాయి.

YSRCP Attack on Andhrajyothy Reporter

చిత్తూరు: ఏపీలో వైసీపీ మూకలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాయి. విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయి. అధికారం కోల్పోయినా కూడా వైసీపీ శ్రేణులు దాడుల సంస్కృతిని కొనసాగిస్తునే ఉన్నాయి. అందుకు సాక్ష్యమే ఈ ఘటన. విధి నిర్వహణలో భాగంగా ఫొటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్ శివకుమార్‌పై దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు. అసలేం జరిగిందంటే..

బంగారుపాలెం జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. జగన్ అక్కడి రైతులతో మాట్లాడే ఫొటోలను తీస్తున్న ఆంధ్రజ్యోతి చిత్తూరు డిప్యూటీ చీఫ్ ఫోటోగ్రాఫర్ శివ కుమార్‌పై దాడి చేశారు. సుమారు పది మంది చుట్టు ముట్టి అతడి చొక్కా చించేసి మరీ విచక్షణారహితంగా కొట్టారు. ఉదయం నుంచి తీసిన ప్రోగ్రాం ఫోటోలు ఉండే మెమరీ కార్డు లాక్కున్నారు.

మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైగ చేయడంతో దాడులకు తెగబడ్డారు. చిత్తూరు వైసీపీ ఇంచార్జి విజయానంద రెడ్డి చూస్తుండగానే ఈ దాడి జరిగింది. మెమరీ కార్డును.. విజయానంద రెడ్డి అనుచరుడు చక్రి తీసుకున్నారు. ఫొటో గ్రాఫర్‌పై దాడి చేసిన వైసీపీ మూకలు, జగన్ పర్యటనలో పోలీసులపై కూడా దౌర్జన్యం చేశారు. మమ్మల్ని అనుమతించకుంటే రప్పా రప్పా అంటూ బెదిరింపులకు దిగారు.

Also Read:

మహిళల పట్ల వైసీపీ తీరు సిగ్గుచేటు: నారా భువనేశ్వరి

వేమిరెడ్డి ఫ్యామిలీపై కుట్ర పన్నారు.. కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు

For More Andhrapradesh News

Updated Date - Jul 09 , 2025 | 06:10 PM