ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu Naidu: క్వాంటమ్‌ ఆవిష్కరణలకు ఆకాశమే హద్దు

ABN, Publish Date - Jul 01 , 2025 | 02:47 AM

ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటమ్‌ టెక్నాలజీ కేంద్రంగా మార్చాలని సంకల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. క్వాంటమ్‌ రంగంలో ఆవిష్కరణలకు ఆకాశమే హద్దుగా పేర్కొన్నారు. స్టార్ట్‌పలకు విస్తృత అవకాశాలున్నాయని.. అవి తరలిరావాలని పిలుపిచ్చారు.

స్టార్ట్‌పలు తరలిరావాలి: చంద్రబాబు

  • అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ

  • అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ

  • వచ్చే జనవరి 1నాటికి రాజధానిలో క్వాంటమ్‌ వ్యాలీ పార్కు

  • ఐబీఎం, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ భాగస్వామ్యంతో ఏర్పాటు

  • దీనికి అనుబంధంగా ఎకోసిస్టమ్‌ కూడా

  • టెక్నాలజీ లేకుంటే యుద్ధాలూ చేయలేం!

  • రాష్ట్రంలో డీప్‌ టెక్నాలజీ, ఏఐ, ఏరోస్పేస్‌, రక్షణ రంగాలకు విస్తృత అవకాశాలు

  • అంతర్జాతీయ సంస్థలు అందిపుచ్చుకోవాలి ఇప్పుడే పెట్టుబడులతో రావాలి: సీఎం

అమరావతి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటమ్‌ టెక్నాలజీ కేంద్రంగా మార్చాలని సంకల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. క్వాంటమ్‌ రంగంలో ఆవిష్కరణలకు ఆకాశమే హద్దుగా పేర్కొన్నారు. స్టార్ట్‌పలకు విస్తృత అవకాశాలున్నాయని.. అవి తరలిరావాలని పిలుపిచ్చారు. అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ తరహాలో అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ ఏర్పాటు తమ లక్ష్యమన్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి ఈ క్వాంటమ్‌ వ్యాలీ పార్కు ప్రారంభమవుతుందని చెప్పారు. దిగ్గజ సంస్థలైన ఐబీఎం, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ భాగస్వామ్యంతో రాష్ట్రప్రభుత్వం దీనిని ఏర్పాటు చేస్తోందన్నారు. క్వాంటమ్‌ వ్యాలీపై సోమవారం విజయవాడలో ఏర్పాటుచేసిన జాతీయ వర్క్‌షాపునకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులు, కేంద్రప్రభుత్వంలోని ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో లేకపోతే.. యుద్ధాలు కూడా చేయలేని పరిస్థితి నెలకొందని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. అమరావతిని గ్లోబల్‌ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని.. అధునాతన సాంకేతిక కేంద్రంగా మారుస్తామని, ఇక్కడకు తరలిరావాలని స్టార్టప్‌ కంపెనీలను ఆహ్వానించారు.

‘నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌ను కేంద్రం ప్రకటించిన వెంటనే అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టే బాధ్యతను ఐబీఎం, ఎల్‌ అండ్‌ టీ, టీసీఎ్‌సకు అప్పగించాం. ఈ పార్కుకు అనుబంధంగా పూర్తిస్థాయి ఎకో సిస్టమ్‌ను ఏర్పాటుచేసి.. అన్నారు. 100కు పైగా మెథడాలజీ(యూజ్‌ కేస్‌)లను విశ్లేషణాత్మకంగా పరీక్షిస్తాం. అమరావతికి ఒక యంత్రాన్ని తీసుకొచ్చి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వచ్చేసిందని అనుకోవడం లేదు. వివిధ ఉపకరణాల నుంచి రియల్‌ టైమ్‌ డేటా విశ్లేషణకు, వ్యవసాయంలో మట్టిలోని తేమ వంటి అంశాలను పరిశీలించడానికి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ అవసరం. క్వాంటమ్‌ టెక్నాలజీ, డీప్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు సరికొత్తసాంకేతిక విప్లవం. ఈ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కొన్ని సానుకూలతలు ఉన్నాయి. రాష్ట్రంలో స్పేస్‌ సిటీ, స్పేస్‌ టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్‌, ఎలకా్ట్రనిక్స్‌ రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను వాట్సాప్‌ ద్వారా అందిస్తున్నాం. ఆగస్టు 15వ తేదీ నుంచి పౌరసేవలన్నీ ఆన్‌లైన్‌లో అందిస్తాం. పాలనలో పౌరుల నివాసాల జియో ట్యాగింగ్‌, సర్వీస్‌ డెలివరీ, ఆన్‌లైన్‌ ఫైళ్లు, క్లౌడ్‌ డేటాలను వినియోగిస్తున్నాం. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీలో స్టార్ట్‌పలనూ చేరిస్తే అవకాశాలు విస్తృతమవుతాయి. ఇది సాంకేతికతను మరోస్థాయికి చేరుస్తుంది’ అని వివరించారు. అమరావతి సహా ఐదు ప్రాంతాల్లో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలు, స్టార్ట్‌పలను కోరారు. ‘బహుళ జాతి సంస్థలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని భాగస్వాములు కావాలి. ఇప్పుడే పెట్టుబడులతో రావలసిన అవసరం ఉంది. భారత్‌లోనే ఉత్పత్తులను తయారుచేసి.. ఇక్కడి మార్కెట్‌ను వినియోగించుకోవాలి. రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచీ ఒక పారిశ్రామికవేత్తను తయారుచేయాలన్న లక్ష్యం పెట్టుకున్నాం’ అని తెలిపారు.

నాడు హైటెక్‌ సిటీని నిర్మించా..

పాలనలో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం తీసుకురావడానికి ఐటీ ఒక్కటే మార్గమని దృఢంగా విశ్వసించానని సీఎం చెప్పారు. హైదరాబాద్‌లో హైటెక్‌సిటీ నిర్మాణంతో బలమైన ఎకోసిస్టమ్‌ను సృష్టించామని.. ఫలితంగా ఇప్పుడు సైబరాబాద్‌ ప్రపంచ ఐటీ కేంద్రంగా మారిందని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ ఆదాయంలో 75 శాతం హైదరాబాద్‌ నుంచే వస్తోందన్నారు. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ కూడా దేశానికి మార్గనిర్దేశం చేయాలని ఆకాంక్షించారు. తమ లక్ష్యాలను కేంద్రప్రభుత్వ సహకారంతో సాధిస్తామని వెల్లడించారు.

క్వాంటమ్‌ విజన్‌ లక్ష్యాలను లోకేశ్‌ సాధించాలి..

లోకేశ్‌ ఐదో తరగతి చదువుతున్నప్పుడే తాను ఐటీ రంగాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించేందుకు కృషి చేశానని.. ఇప్పుడు క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వచ్చేసిందని.. లోకేశ్‌ ఐటీ మంత్రి అయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమెరికాలోని కార్నెగీ మెలన్‌ విశ్వవిద్యాలయంలో చదువుకున్న ఆయన.. ఇప్పుడు ఐటీ మంత్రిగా ఉండడం సంతోషదాయకమన్నారు. క్వాంటమ్‌ టెక్నాలజీ విజన్‌ లక్ష్యాలను సాధించే బాధ్యతను ఆయనకు అప్పగించానని చెప్పారు. భవిష్యత్‌ పాలనకు క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ దిక్సూచిగా పనిచేస్తుందన్నారు. తాను నిత్య విద్యార్థినని, భవిష్యత్‌ టెక్నాలజీని పాలనకు, అభివృద్ధికి సమ్మిళితం చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. ఈ వర్క్‌షాపులో కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకునేందుకు 4 గంటల పాటు కొత్త అంశాలను రాసుకుంటూనే ఉన్నానని చెప్పారు. ఈ వర్క్‌షాపులో.. అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటమ్‌ కంప్యూటర్‌ నమూనాను ఐబీఎం ప్రదర్శించింది. దీనితో పాటు పలు క్వాంటమ్‌ టెక్నాలజీ స్టార్ట్‌పలను లోకేశ్‌తో కలిసి చంద్రబాబు పరిశీలించారు.

Updated Date - Jul 01 , 2025 | 06:57 AM