Nara Lokesh: ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలు
ABN, Publish Date - Jul 01 , 2025 | 02:40 AM
రాజధాని అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ దక్షిణాసియాలోనే మొదటిదని ఐటీ, విద్య, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి లోకేశ్ వెల్లడించారు.
అమరావతి క్వాంటమ్ వ్యాలీ..దక్షిణాసియాలోనే మొదటిది
ఇక్కడ 50కి పైగా యూనికార్న్‌ల అభివృద్ధి
చంద్రబాబు సాంకేతిక విప్లవంలో ఇది సెకండ్ చాప్టర్
క్వాంటమ్ వర్క్‌షాపులో మంత్రి లోకేశ్
అమరావతి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ దక్షిణాసియాలోనే మొదటిదని ఐటీ, విద్య, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఇందులో ఐదేళ్లలో లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. 50కి పైగా యూనికార్న్‌లు అభివృద్ధి చేస్తామన్నారు. ఈ వ్యాలీ చంద్రబాబు సాంకేతిక విప్లవంలో సెకండ్ చాప్టర్‌గా పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షా్‌పలో ఆయన మాట్లాడారు. వచ్చే జనవరి 1న ప్రారంభించే ఈ క్వాంటమ్ వ్యాలీకి అనుబంధంగా.. ఆలోచనలను ఆవిష్కరణలుగా.. ఆవిష్కరణలను పరిశ్రమలుగా మార్చే ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇది ఒకరోజు కార్యక్రమం కాదని.. నిరంతర కొనసాగుతుందని.. దీనికి అమరావతి కేంద్ర బిందువుగా ఉంటుందని అన్నారు. క్యూబిక్ ఆర్కిటెక్చర్ నుంచి క్రయోఎలకా్ట్రనిక్స్ వరకూ.. అల్గారిథం అభివృద్ధి నుంచి క్వాంటమ్ సామర్థ్యాన్ని అభివ్దృద్ధి చేస్తామని వెల్లడించారు. దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్-2 త్వరలోనే అమరావతిలో అందుబాటులోకి వస్తుందని, ఇది చాలా గర్వించదగ్గ విషయమని చెప్పారు.
ఆసియాలో మొట్టమొదటి క్వాంటమ్ ప్రమాణాల టెస్ట్‌టెట్ ను ఎన్సీఎల్, ఐఈఈఈ, ఏడబ్ల్యుఎస్, సీయూక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తామని వెల్లడించారు. ఐబీఎం, టీసీఎల్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్ర వంటి అగ్రగామి సంస్థల సహకారంతో క్వాంటమ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధాని మోదీ ప్రకటించిన జాతీయ క్వాంటమ్ మిషన్‌కు అనుసంధానంగా గ్లోబల్ భాగస్వామ్యంతో వ్యాలీ పార్కును నిర్మిస్తామన్నారు. ఐఐటీలు, ఐఐఎస్, టోక్యో వర్సిటీల సహకారంతో విద్యార్థుల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతిక నైపుణ్యాన్ని వృద్ధి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ మేధో రాజధానిగా ఆవిర్భవిస్తోందని లోకేశ్ అన్నారు. సీఎం చంద్రబాబులాంటి నాయకుడు ఉండడం అదృష్టంగా పేర్కొన్నారు. విజన్ అంటే ఇప్పుడు వెలాసిటీ, ఇన్నోవేషన్, గ్లోబల్ రేస్‌లో చేరడం కాదని.. మనమే దారిచూపాలని అన్నారు.
Updated Date - Jul 01 , 2025 | 02:41 AM