TG Politics: ఏపీలో నేతలపై రాళ్ల దాడి.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Apr 15 , 2024 | 03:24 PM
ఏపీలో ప్రధాన పార్టీల అధినేతలపై వరుసగా రాళ్ల దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై జరిగిన రాళ్ల దాడి ఘటనలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ఏపీలో ప్రధాన పార్టీల అధినేతలపై వరుసగా రాళ్ల దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై జరిగిన రాళ్ల దాడి ఘటనలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో కొత్త డ్రామా నడుస్తోందని అన్నారు. ఆయా పార్టీల నేతలను రాళ్లతో కొట్టడం ఏంది? అని ప్రశ్నించారు.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు.
ఏపీలో కూడా కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావాలని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాళ్లతో కొట్టుకునే వ్యవస్థ ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో స్వయం పాలన వచ్చింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడంతోనేనని చెప్పారు. ఏపీ సీఎం మీ దగ్గరే ఉన్నారని మీ గల్లీల్లోనే తిరుగుతున్నారని అన్నారు. దేశంలో అన్ని వస్తువుల ధరలు పెరిగి పట్టపగలే చుక్కలు చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రాముడు లీడర్ కాదు.. దేవుడని అన్నారు.
దేశాన్ని అప్పుల పాలు చేయమని శ్రీ రాముడు కోరుకున్నాడా? అని ప్రశ్నించారు. రాముడి పేరు చెప్పి ప్రజలను బీజేపీ నేతలు పరేషాన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాముడిని బీజేపీ నేతలు మొక్కినట్టు బిల్డప్ ఇస్తున్నారన్నారు. అప్పులు చేసే ప్రధాని తమకు వద్దని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. 65 సంవత్సరాల్లో చేసిన అప్పును.. కేవలం 9 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డబుల్ చేశారని మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అప్పులను డబుల్ చేయడమా? అని ప్రశ్నించారు.
Chattisgarh: బీజాపూర్ ఎన్‌కౌంటర్లకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్ట్ పార్టీ
హనుమంతుడి గుడిలో దీపం పెట్టేది కాంగ్రెస్ కార్యకర్తనేనని చెప్పారు. ఏ బీజేపీ నాయకుడు గుడిలో దీపం పెట్టడన్నారు. తాము కెమెరా లేకుండా దేవుడిని మొక్కుతామన్నారు. దేవుడితో రాజకీయం చేయొచ్చని బీజేపీని చూసి అర్థం అయిందన్నారు. ప్రధాని అయ్యే అర్హత రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని చెప్పారు. తాము తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోదీ వచ్చాక బంగారం ధర మూడు రెట్లు పెరిగిందన్నారు. మళ్లీ మోదీ ప్రధాని అయితే బంగారం ధర ఇంకా పెరుగుతుందని.. దేశంలో కాంగ్రెస్ పాలన రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రధాని అయితే అన్ని వస్తువుల ధరలను తగ్గిస్తారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Jeevan Reddy: నిజామాబాద్‌లో పసుపుబోర్డుకు కాంగ్రెస్ సిద్ధం...
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...
Updated Date - Apr 15 , 2024 | 03:35 PM