Srinivas Goud : కేంద్రం నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారిమళ్లించింది.. శ్రీనివాస్ గౌడ్ షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Sep 02 , 2024 | 08:57 PM
కాంగ్రెస్ పాలనలో సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలు చేశారు. చేసిన పనులకు బిల్లులు రాక వారు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలు చేశారు. చేసిన పనులకు బిల్లులు రాక వారు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు (సోమవారం) తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రూ. 1300 కోట్లు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అప్పులు తెచ్చి చేసిన పనులకు బిల్లులు ఇవ్వక పోవడంతో సర్పంచ్లు రోడ్డున పడ్డారని శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చిన నిధులను కాం గ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. సర్పంచుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. వారం రోజుల్లో సర్పంచుల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. సర్పంచ్లకు తాము అండగా నిలుస్తామని శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు..
బారీ వర్షాలు.. ప్రభుత్వ చర్యలేవీ.. కేటీఆర్
తెలంగాణలో మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వర్షాలు పడుతుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్ ప్రభుత్వం, మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో సరైన రక్షణ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎస్ఎన్ డీపీ హైదరాబాద్‌లో మార్పును తీసుకొచ్చిందని చెప్పారు. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
నిన్న కురిసిన భారీ వర్షాల వల్ల హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు ముంపునకు గురికాలేదని వినడానికి చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇంజనీర్లు, వివిధ విభాగాల సమస్టి కృషితోనే ఇది సాధ్యం అయిందని చెప్పారు. వారి అంకితభావం వల్లే ఈరోజు హైదరాబాద్ మరింత బలంగా, మెరుగ్గా తయారైందని తెలిపారు. తనతో పాటు నిలబడి ఈ నగర ప్రగతికి నమూనాగా మార్చినందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - Sep 02 , 2024 | 09:06 PM