TG News: బండ్లగూడలో ఉద్రికత్త.. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ
ABN, Publish Date - Jun 30 , 2024 | 05:32 PM
హరిత మహోత్సవం కార్యక్రమాన్ని ఈరోజు(ఆదివారం) బండ్లగూడలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండు వర్గాల మధ్యఘర్షణ చెలరేగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హైదరాబాద్: హరిత మహోత్సవం కార్యక్రమాన్ని ఈరోజు(ఆదివారం) బండ్లగూడలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండు వర్గాల మధ్యఘర్షణ చెలరేగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బండ్లగూడ జాగీర్ మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు రెచ్చిపోయారు. బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్‌తో అసభ్యంగా ప్రవర్తించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోనే మాజీ మేయర్ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు.
అడ్డుకున్న కార్పొరేటర్లపై దాడి చేసి పిడుగుద్దుల వర్షం కురిపించారు. ఎమ్మెల్యే ఎదుటే రౌడీలుగా రాజకీయ నాయకులు మారి కొట్టుకున్నారు. 1 వ వార్డు కార్పొరేటర్ చంద్రశేఖర్ చొక్కా చింపేసి కులం పేరుతో బూతులు తిడుతూ దాడి చేశారు. 5 వ వర్డు కార్పొరేటర్ శ్రీనాధ్‌రెడ్డితో పాటు పలువురిపై గుండాలు దాడికి పాల్పడ్డారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు బాధితులు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.
Updated Date - Jun 30 , 2024 | 05:32 PM