ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: గ్రేటర్‌లో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల సమ్మె

ABN, Publish Date - May 20 , 2024 | 11:11 AM

Telangana: గ్రేటర్‌లో జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు సమ్మెకు దిగారు. సోమవారం ఉదయం నగరంలోని జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాల వద్ద కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. కాంట్రాక్టుల మెరుపు సమ్మెతో నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు.

GHMC contractors strike

హైదరాబాద్, మే 20: గ్రేటర్‌లో జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు (GHMC contractors )సమ్మెకు దిగారు. సోమవారం ఉదయం నగరంలోని జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాల వద్ద కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. కాంట్రాక్టుల సమ్మెతో నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా దాదాపు రూ.1300 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) తమతో పనులు చేయించుకుని బిల్లులు పెండింగ్‌లో పెట్టిందంటూ కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తమను ఆదుకోవాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. అప్పుల భారంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మృతి.. ధృవీకరించిన స్థానిక మీడియా


కాగా.. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటూ కొద్ది నెలల క్రితమే జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఈనెల 18 వరకు డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. అయితే కాంట్రాక్టర్లు విధించిన డెడ్‌లైన్‌పై అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గత శనివారం కాంట్రాక్టర్లు సమావేశమయ్యారు. బిల్లులు చెల్లించే వరకు పనులకు దూరంగా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. అయితే రహదారుల నిర్మాణం, మరమ్మతు, నాలాల రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం, పూడికతీత, ఇతరత్రా నిర్వహణ పనులకు సంబంధించి వారికి రావాల్సిన దాదాపు రూ.1350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వేతనాలు, అప్పుల వాయిదాల చెల్లింపునకు అవస్థలు పడుతోన్న బల్దియా.. కాంట్రాక్టర్ల బకాయిలను దీర్ఘకాలికంగా పెండింగ్‌లో పెట్టింది. ఆర్థిక సంవత్సరం ముగిసిన మార్చిలో, ఎర్లీ బర్డ్‌తో ఏప్రిల్‌లో జీహెచ్‌ఎంసీకి రూ.1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చినా కాంట్రాక్టర్లకు బకాయిలు ఇవ్వలేదు. ఈక్రమంలో జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు సమ్మెకు దిగారు. బకాయిలు చెల్లించే వరకు సమ్మె ఆపేది లేదని కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. హోరు గాలిలో ఘాట్ రోడ్‌లో జర్నీ ఎంత ప్రమాదకరమో తెలుసా? ఈ వీడియో చూస్తే..

AP Poll Violence: ఏపీలో అల్లర్లపై సిద్ధమైన సిట్ ప్రాథమిక నివేదిక

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 20 , 2024 | 11:13 AM

Advertising
Advertising