ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: మేడిగడ్డపై కుట్రలు.. బీజేపీతో పొత్తుపై బాల్క సుమన్ ఏమన్నారంటే..

ABN, Publish Date - Feb 19 , 2024 | 07:41 PM

గురుకుల విద్యార్థుల ఆత్మహత్యల ఘటనపై బీఆర్ఎస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. రేవంత్ ప్రభుత్వం కారణంగానే గడిచిన 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

గురుకుల విద్యార్థుల ఆత్మహత్యల ఘటనపై బీఆర్ఎస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. రేవంత్ ప్రభుత్వం కారణంగానే గడిచిన 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం అని అన్నారు. మేధావులకు ఈ విద్యార్థినిల ఆత్మహత్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సమస్యలు లేనట్టు ముఖ్యమంత్రి దిల్లీకి చక్కర్లు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక విమానాల్లో దిల్లీ హై కమాండ్ కు డబ్బు సంచులు మోసుకుపోతున్నారని ఘాటు విమర్శలు చేశారు బాల్క సుమన్.

"ఎన్నికల షెడ్యూల్ తొందరగా రావాలని సీఎం రేవంత్ రెడ్డి రోడూ పెద్దమ్మ తల్లికి మొక్కుకుంటున్నారు. మేడిగడ్డను బూచిగా చూపించి పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మేడిగడ్డపై కుట్రలు జరుగుతున్నట్లు మాకు అనుమానం వస్తుంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని కిషన్ రెడ్డితో మేము అన్నామా..?.. మాది సెక్యులర్ పార్టీ. మా కేసీఆరే మాకు సెక్యులర్ నాయకుడు. పొత్తు పెట్టుకుంటామని వాళ్లే మీడియాకు లీకులు ఇస్తున్నారు" అని బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 19 , 2024 | 07:42 PM

Advertising
Advertising