BJP MLA: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్‌పై దర్యాప్తు
ABN, First Publish Date - 2024-01-19T11:40:43+05:30
ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Rajasingh)కు వచ్చిన బెదిరింపు కాల్స్ వ్యవహారంలో మంగళ్‌హాట్ పోలీసులు స్పందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్: (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Rajasingh)కు వచ్చిన బెదిరింపు కాల్స్ వ్యవహారంలో మంగళ్‌హాట్ పోలీసులు స్పందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని రోజులుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Rajasingh)కు కొంతమంది ఫోన్ చేస్తూ శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహిస్తే చంపుతామంటూ బెదిరించారు. ఇదే విషయమై రాజాసింగ్ నగర కమిషనర్‌తోపాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా గత రెండు రోజుల క్రితం సైతం ఓ వ్యక్తి ఫోన్ చేసి హైదరాబాద్‌లోనే చంపుతానంటూ చాలెంజ్ చేయడంతో అదే విషయాన్ని రాజాసింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ అంశంపై స్పందించిన మంగళ్‌హాట్ పోలీసులు కేసు నమోదు చేసి వాటిపై ఆరా తీస్తున్నారు.
Updated Date - 2024-01-19T11:40:45+05:30 IST