ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

T20 World Cup: ఓపెనర్లుగా ఆ స్టార్ ప్లేయర్లే ఉత్తమం.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, Publish Date - Apr 23 , 2024 | 05:23 PM

టీ20 వరల్డ్‌కప్ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరెవరికి స్థానం కల్పించాలన్న విషయంపై మాజీ ఆటగాళ్లు తమతమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఇదే సమయంలో.. ఓపెనర్లుగా ఎవరు దిగితే బాగుంటుందనే సూచనలు...

Sourav Ganguly On Indian Openers At T20 World Cup

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరెవరికి స్థానం కల్పించాలన్న విషయంపై మాజీ ఆటగాళ్లు తమతమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఇదే సమయంలో.. ఓపెనర్లుగా ఎవరు దిగితే బాగుంటుందనే సూచనలు కూడా ఇస్తున్నారు. తాజాగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) సైతం ఈ విషయంపై తనదైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. జట్టు ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని జట్టుని ఎంపిక చేయాల్సి ఉందని పేర్కొన్న ఆయన.. ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మతో (Rohit Sharma) పాటు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఓపెనింగ్‌కు దిగితే బాగుంటుందని అన్నాడు.


టీ పెట్టిన చిచ్చు.. పెళ్లిలో కొట్టేసుకున్న బంధువులు.. చివర్లో పెద్ద ట్విస్ట్

సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో గంగూలీ మాట్లాడుతూ.. ‘‘వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్పకుండా వెళ్లాలి. ఓపెనర్లుగా ఎవరిని రంగంలోకి దింపుతారనేది సెలక్టర్ల చేతిలో ఉంది. కానీ.. నన్ను అడిగితే మాత్రం ఈ మెగా టోర్నీలో రోహిత్, కోహ్లీ ఓపెనర్లుగా దిగితే బాగుంటుంది’’ అని చెప్పాడు. ఇదే సమయంలో.. కోహ్లీకి ఈ ఐపీఎల్ సీజన్‌లో తక్కువ స్ట్రైక్ రేట్ ఉందని వస్తున్న విమర్శలకు కౌంటరిస్తూ.. 40 బంతుల్లో సెంచరీ చేయగలం సామర్థ్యం అతని సొంతమని కొనియాడాడు. అలాగే.. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జట్టుని ఎంపిక చేయాల్సిన బాధ్యత సెలక్షన్ కమిటీ, కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), కెప్టెన్ రోహిత్‌లపై ఉందని పేర్కొన్నాడు.

‘భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వద్దు.. ఆ క్రికెటరే ముద్దు’

టీ20 వరల్డ్‌కప్ వంటి టోర్నీలో ఎలాంటి భయం లేకుండా ఆడటం చాలా ముఖ్యమని.. ఈ టోర్నీలో బౌండరీలు కొట్టడం ముఖ్యమని.. జట్టు మొత్తం హిట్టింగ్‌పై దృష్టి సారించాలని గంగూలీ సూచించాడు. రోహిత్‌, కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబే, హార్దిక్‌ పాండ్యాతో పాటు చాలామంది అద్భుత ఆటగాళ్లు ఉన్నారని.. బౌండరీలు బాదడంలో వారి నైపుణ్యం అమోఘమని ప్రశంసించాడు. టీ20 వరల్డ్‌కప్ ఎంపిక చేసే జట్టులతో యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులూ ఉండాల్సిన అవసరం ఉందని గంగూలీ తెలిపాడు.

Read Latest Sport News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 05:23 PM

Advertising
Advertising