Share News

Hardik Pandya: ‘భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వద్దు.. ఆ క్రికెటరే ముద్దు’

ABN , Publish Date - Apr 23 , 2024 | 03:42 PM

ప్రస్తుతం భారత జట్టుకి అన్ని ఫార్మాట్‌లలో నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్న రోహిత్ శర్మ తర్వాత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు ఇప్పించాలని బీసీసీఐ భావిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఆ దిశగా అతడ్ని సిద్ధం చేస్తున్నారు.

Hardik Pandya: ‘భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వద్దు.. ఆ క్రికెటరే ముద్దు’
Harbhajan Singh Backed Sanju Samson As T20 Captain

ప్రస్తుతం భారత జట్టుకి అన్ని ఫార్మాట్‌లలో నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్న రోహిత్ శర్మ (Rohit Sharma) తర్వాత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) జట్టు పగ్గాలు ఇప్పించాలని బీసీసీఐ (BCCI) భావిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఆ దిశగా అతడ్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు అతను కెప్టెన్‌గా వ్యవహరించాడు కూడా! ఆ సమయంలో కెప్టెన్‌గా, ఆటగాడిగా సమర్థవంతంగా రాణించడం చూసి.. రోహిత్ తర్వాత అతడే టీమిండియాకు పర్ఫెక్ట్ కెప్టెన్ అనే కామెంట్లూ వినిపించాయి. కానీ.. ఇప్పుడు పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. హార్దిక్‌కి వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


కోహ్లి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత.. ఎందుకంటే..?

తాజాగా భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) సైతం పరోక్షంగా హార్దిక్‌ని భారత టీ20 జట్టుకి కెప్టెన్‌గా నియమించవద్దని చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుని గొప్పగా నడిపిస్తున్న సంజూ శాంసన్‌కి (Sanju Samson) రోహిత్ తర్వాత భారత టీ20 జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఎక్స్ వేదికగా కోరాడు. ‘‘టీ20 వరల్డ్‌కప్ 2024లో వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం గురించి ఎలాంటి చర్చ అవసరం లేదు. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టులో సంజూ శాంసన్‌ని తీసుకోవాలి. అంతేకాదు.. రోహిత్ తర్వాత టీ20 కెప్టెన్‌గా సంజూని తీర్చిదిద్దాలి. ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉన్నాయా?’’ అని హర్భజన్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ జట్టుపై ఆర్ఆర్ గెలిచిన తర్వాత అతను ఈ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్.. అటు క్రికెట్ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ధోనీ నెక్ట్స్ సీజన్‌లో ఉంటాడా.. ఆ వ్యాఖ్యల వెనుక అర్థం అదేనా?

కాగా.. త్వరలో జరగబోయే టీ20 వరల్డ్‌కప్ టోర్నీ కోసం జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్‌గా స్థానం పొందడానికి రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, దినేశ్ కార్తిక్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ సీజన్‌లో వీళ్లిద్దరు మెరుగ్గా రాణిస్తున్నారు. కానీ.. ఈ రేసులో మిగతావాళ్లతో పోలిస్తే సంజూ శాంసన్ ముందంజలో ఉన్నాడు. కెప్టెన్‌గా జట్టుని గొప్పగా నడిపించడంతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్‌గా దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకూ 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 62.80 సగటుతో 314 పరుగులు చేశాడు. అందుకే.. హర్భజన్ ఇతని పేరుని సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. మరి.. అతని అభిప్రాయాన్ని బీసీసీఐ పరిగణనలోకి తీసుకుంటుందా? సంజూకి జట్టులో చోటు దక్కుతుందా? వేచి చూడాల్సిందే.

Read Latest Sports News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 03:42 PM