ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: నీటి గుర్రం పవరేంటో తెలీక ఒక్కసారిగా చుట్టుముట్టిన సింహాలు.. చివరకు ఏమైందంటే..

ABN, First Publish Date - 2024-07-31T20:36:51+05:30

ఏనుగులు, నీటి గుర్రాలు సాధారణంగా మిగతా జంతువుల జోలికి వెళ్లవు. ఒకవేళ వాటికి జోలికి ఏ జంతువైనా వెళ్లిందంటే మాత్రం ఇక వాటితో ఫుట్‌బాల్ ఆడుకుంటాయి. దీంతో చివరకు నీటిలో ఉండే మొసళ్లు కూడా...

ఏనుగులు, నీటి గుర్రాలు సాధారణంగా మిగతా జంతువుల జోలికి వెళ్లవు. ఒకవేళ వాటికి జోలికి ఏ జంతువైనా వెళ్లిందంటే మాత్రం ఇక వాటితో ఫుట్‌బాల్ ఆడుకుంటాయి. దీంతో చివరకు నీటిలో ఉండే మొసళ్లు కూడా వీటిపై దాడి చేయడానికి సాహసం చేయవు. కొన్నిసార్లు పులులు, సింహాలు వీటిపై దాడి చేయాలని చూస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని సింహాలు నీటి గుర్రం పవరేంటో తెలీక ఒక్కసారిగా చుట్టుముడతాయి. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని (South Africa) క్రుగర్ నేషనల్ పార్క్‌లో చోటు చేసుకుంది. ఓ నీటి గుర్రం నది ఒడ్డున నడుస్తూ వెళ్తుంటుంది. అప్పటికే ఆకలితో ఉన్న 5 సింహాలు దూరంగా పడుకుని వేట కోసం కాపు కాచి ఉంటాయి. ఈ క్రమంలో అటుగా వెళ్లిన నీటి గర్రాన్ని చూసి అలెర్ట్ అవుతాయి. ‘‘ఈ పూటకు ఈ నీటి గుర్రాన్ని తినేస్తే సరిపోతుంది’’.. అని అనుకుంటూ అన్ని సింహాలు ఒక్కచోట చేరతాయి. సింహాలను చూసిన నీటి గుర్రం భయపడుతూ భయపడుతూనే అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది. నీటి గుర్రాన్ని చూసి గాండ్రించిన సింహాలు (lions tried to attack the hippo) మెల్ల మెల్లగా దానిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి.

Viral Video: పేరుకే ఎలిగేటర్..ఈ యువతి చేయి వేయగానే.. ఏం చేసిందో చూడండి..


ఈ క్రమంలో ఒక్కసారిగా సింహాలన్నీ నీటి గుర్రాన్ని చుట్టుముడతాయి. నీటి గుర్రం కూడా వాటితో పోరాటానికి సిద్ధమవుతుంది. అన్ని చుట్టముట్టి తికమకపెట్టి దాడి చేయాలని చూస్తున్నా.. నీటి గుర్రం మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా గుండ్రంగా తిరుగుతూ సింహాలపై ఎదురుదాడి చేస్తుంది. దీంతో సింహాలు భయంతో వెనకడుగు వేస్తాయి. ఈ క్రమంలో ఓ సింహం వెనుక నుంచి నీటి గుర్రం పైకి దూకుతుంది. రెండు కాళ్లు దానిపై వేసి కిందపడేయాలని చూస్తుంది. అయితే నీటి గుర్రం మాత్రం ధైర్యంగా దాన్ని విదిలించుకుంటూ గడ్డిలోకి దూరి, అటునుంచి అటే నీటిలోకి వెళ్లిపోతుంది.

Viral Video: వామ్మో..! చిన్న పిల్లలను టార్గెట్ చేసిన గేదె.. చూస్తుండగానే ఇలా చేసిందేంటీ..


హిప్పో నీటిలోకి వెళ్లిపోవడంతో (hippo escaped from lions) చివరకు సింహాలన్నీ నిరాశగా అలాగే నిలబడి చూస్తుంటాయి. ఇలా 5 సింహాలు చుట్టుముట్టినా కూడా నీటి గుర్రాన్ని ఏమీ చేయలేకపోతాయి. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ నీటి గుర్రం పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘సింహాలకు చుక్కలు చూపించిన నీటిగుర్రం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి..

Viral Video: నీటిలో నుంచి ఒడ్డుకు చేరుకున్న జాగ్వార్.. సడన్‌గా తోక పట్టుకున్న మొసలి.. చివరకు..

Updated Date - 2024-07-31T20:36:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising