ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: పోటీకి సోనియా, రాహుల్ దూరం.. బరేలి అమేథి కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా..??

ABN, Publish Date - Mar 20 , 2024 | 11:17 AM

లోక్‌సభ ఎన్నికల ప్రకటనతో దేశవ్యాప్తంగా రాజకీయ సందడి మొదలైంది. అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ బిజీగా మారింది. ఈ క్రమంలో ఇవాళ జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం అనంతరం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికల ప్రకటనతో దేశవ్యాప్తంగా రాజకీయ సందడి మొదలైంది. అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ బిజీగా మారింది. ఈ క్రమంలో ఇవాళ జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం అనంతరం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ ( Congress ) కంచుకోటగా మారిన ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ, అమేథీ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానాల్లో రాహుల్, ప్రియాంక గాంధీలు పోటీ చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే వారు పోటీ చేయడం లేదనే సంకేతాలు ఇవ్వడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరేలీలో మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. దీంతో కాంగ్రెస్ తన అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనెట్‌ను అమేథీ నుంచి పోటీకి దింపాలనుకున్నా ఆమె నిరాకరించడం గమనార్హం.

అమేథీ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్, అసెంబ్లీ అభ్యర్థి విజయ్ పాసి పేర్లు కూడా రేసులో ఉన్నాయి. అదే సమయంలో రాయ్ బరేలీ నుంచి స్వామి ప్రసాద్ మౌర్యను బరిలోకి దింపాలనే చర్చ సాగుతోంది. వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తన అధికార ప్రతినిధి పవన్ ఖేడాను పోటీకి దింపాలని భావిస్తోంది. ఆయనతో పాటు యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ కూడా వారణాసి నుంచి రేసులో ఉన్నారు. అయితే ఈ సీట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.


మరోవైపు.. వారణాసి, అమేథీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈసారి కూడా ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి టిక్కెట్ ఇచ్చారు. 2019లో స్మృతి అమేథీ స్థానం నుంచి రాహుల్ గాంధీని ఓడించారు. సోనియా గాంధీ రాయ్‌బరేలీ నుంచి గెలుపొందారు, కానీ ఆమె ఈసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 11:17 AM

Advertising
Advertising